News December 24, 2024

భూ రికార్డుల్లో తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు!

image

TG: ప్రభుత్వం ధరణి స్థానంలో ‘భూ భారతి’ చట్టాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందిన ఈ చట్టం బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వం కఠిన నిబంధనలను పెట్టినట్లు తెలుస్తోంది. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే అధికారులపై క్రిమినల్ కేసులతో పాటు ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News December 2, 2025

‘మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటి చొరవ తీసుకోవాలి’

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి భద్రాద్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఖమ్మం యూనివర్సిటీ కల సాకారమవుతుందని స్థానికులు, విద్యార్థులు ఆశిస్తున్నారు. 45 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను పరిష్కరించి, అన్ని వనరులు ఉన్న ఎస్ఆర్ & బీజీఎన్ఆర్ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటిస్తారని ఆశపడుతున్నారు. ఈ విషయంలో మంత్రులు తుమ్మల, భట్టి, పొంగులేటి చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News December 2, 2025

లేజర్ వెపన్ ‘ఐరన్ బీమ్’ సిద్ధం చేసిన ఇజ్రాయెల్!

image

అత్యాధునిక, హైపవర్ లేజర్ రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ‘ఐరన్ బీమ్’ను డిసెంబర్ 30న దళాలకు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది. విమానాలు, క్షిపణులు, రాకెట్లు, UAVs, డ్రోన్లను భూమిపై నుంచే ఛేదించేలా రూపొందించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. 2014లోనే ఐరన్ బీమ్‌ను ఇజ్రాయెల్ ఆవిష్కరించింది. కానీ 11 ఏళ్లుగా అభివృద్ధి దశలోనే ఉంది. ఆ ప్రక్రియను పూర్తి చేసి సైన్యానికి అందించనుంది.

News December 2, 2025

ఇవి వాడితే పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

image

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్రపురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.