News December 1, 2024
ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే క్రిమినల్ కేసులు!

TG: ప్రభుత్వ అధికారుల రక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. లగచర్ల, దిలావర్‌పూర్ ఘటనలతో పాటు సిరిసిల్ల కలెక్టర్‌పై <<14720925>>కేటీఆర్ వ్యాఖ్యల<<>> నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫీసర్లపై దాడి చేసినా, బెదిరించినా రెండేళ్ల పాటు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
Similar News
News February 15, 2025
‘బార్బోన్ విస్కీ’పై టారిఫ్ తగ్గించిన భారత్

అమెరికాకు చెందిన మోస్ట్ పాపులర్ ‘బార్బోన్ విస్కీ’పై భారత ప్రభుత్వం టారిఫ్ రేటును తగ్గించింది. ఇదివరకు ఈ విస్కీ దిగుమతులపై 150% టారిఫ్ ఉండగా, దాన్ని 100%కి తగ్గించింది. మిగిలిన ఆల్కహాల్ ఉత్పత్తులపై 150% టారిఫ్ కొనసాగనుంది. 2023-24లో భారత్ 2.5 మి. డాలర్ల విలువైన బార్బోన్ విస్కీని దిగుమతి చేసుకుంది. భారత్ దిగుమతులపై అధిక టారిఫ్స్ వేస్తోందని ట్రంప్ విమర్శించిన తర్వాతి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
News February 15, 2025
GOOD NEWS: పప్పుల రేట్లు తగ్గాయ్

TG: భారీగా పెరిగిన పప్పుల ధరలు దిగొస్తున్నాయి. గతేడాది రూ.200-240 వరకు వెళ్లిన క్వాలిటీ కేజీ కందిపప్పు ప్రస్తుతం రూ.150-160కి వచ్చింది. క్వాలిటీ తక్కువుండే పప్పు రూ.110-125 పలుకుతోంది. శనగ పప్పు రూ.150 నుంచి రూ.135కు, మినప పప్పు రూ.160 నుంచి రూ.150కి, మైసూర్ పప్పు రూ.130 నుంచి రూ.115కి తగ్గింది. రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు, మార్కెట్లకు సరఫరా పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
News February 15, 2025
బర్డ్ ఫ్లూ.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

AP: బర్డ్ ఫ్లూతో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌కు సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలు తీర్చేందుకు పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. ఎవరికైనా సందేహాలుంటే ఉ.6 నుంచి రా.9 గంటల మధ్య 0866 2472543, 9491168699 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.