News February 3, 2025
నెతన్యాహు సతీమణిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్

ఇజ్రాయెల్ PM నెతన్యాహు సతీమణి సారాపై నేర విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనపై ఉన్న ఓ అవినీతి కేసులో సాక్షులను ఆమె బెదిరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు స్టేట్ అటార్నీ వెల్లడించింది. తనకు అనుకూలంగా వార్తలు రాసినందుకు కొన్ని మీడియా సంస్థలకు నెతన్యాహు డబ్బులు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. మోసం, నమ్మకద్రోహం, అవినీతిపై విచారణ జరుగుతోంది.
Similar News
News January 31, 2026
శని త్రయోదశి పూజ ఎలా చేయాలి?

నవగ్రహ ఆలయంలో శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు పోసి మూటకట్టి దీపారాధన చేయాలి. తమలపాకులో బెల్లం ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే రావి చెట్టుకు 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. పూజ అనంతరం నల్లని వస్త్రాలు, పాదరక్షలు లేదా ఆహారాన్ని దానం చేయాలి. శివార్చన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని పండితులు సూచిస్తున్నారు.
News January 31, 2026
బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే ఢమాల్

అంతర్జాతీయ మార్కెట్లో నిన్న బంగారం ధర 11%, వెండి రేటు 32% తగ్గింది. గురువారం ఔన్స్(28.35gms) బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు $5,595(రూ.5.13L)కి చేరగా శుక్రవారం $4,722(రూ.4.32L)కి తగ్గింది. ఔన్స్ సిల్వర్ గురువారం $121.67(రూ.11,155)గా ఉండగా శుక్రవారం $79.30(రూ.7,270)కి పడిపోయింది. USD బలోపేతం, ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌గా కెవిన్ వార్ష్ నామినేట్, అమ్మకాలు పెరిగి కొనుగోళ్లు తగ్గడం వంటివి దీనికి కారణాలు.
News January 31, 2026
T20 WCలో ఇద్దరు స్పిన్నర్లు వద్దు: అశ్విన్

T20 WCలో టీమ్ ఇండియా తుది జట్టులో ఇద్దరు మెయిన్ స్పిన్నర్లను ఆడించొద్దని మాజీ క్రికెటర్ అశ్విన్ సూచించారు. ‘ఒక మెయిన్ స్పిన్నర్, ఒక స్పిన్ ఆల్ రౌండర్‌ను ఆడించాలి. ఇద్దరు మెయిన్ స్పిన్నర్ల(కుల్దీప్, వరుణ్)ను ఆడిస్తే బ్యాటింగ్‌లో డెప్త్ ఉండదు. అలాగే వరుణ్‌ను ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకుండా తెలివిగా వాడాలి. అభిషేక్ తన బౌలింగ్‌పై దృష్టి పెడితే మంచి ఆల్‌రౌండర్ అవుతాడు’ అని తన YT వీడియోలో అభిప్రాయపడ్డారు.


