News December 19, 2024

క్రేజ్‌ను క్యాచ్ చేసుకుంటోన్న CROCS

image

CROCS కంపెనీ చెప్పుల గురించి యువతకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది వీటిని ధరించేందుకు ఇష్టపడుతుంటారు. దీంతో ఈ అమెరికన్ కంపెనీ వ్యాపారం భారీగా పెరిగిపోతోంది. 2019లో $1.23 బిలియన్‌గా ఉన్న క్రాక్స్ బిజినెస్ 2023లో మూడింతలు పెరిగి $3.96 బిలియన్ల వ్యాపారం చేసింది. ఈ ఏడాది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చెప్పుల ధర రూ.2500 – రూ.10000 వరకు ఉంటుంది.

Similar News

News November 15, 2025

కలియుగ ధర్మ సూత్రమిదే..

image

ఈ కలియుగంలో నీ గతం ఎంత గొప్పదైనా నీవు చేసిన ఒక్క తప్పును జనం చెడుగానే పరిగణిస్తారు. వంద మంచి పనులు చేసినా, ఒక చిన్న లోపం కనిపిస్తే, లోకం నిన్ను చెడ్డవానిగా ముద్రవేస్తుంది. అదేవిధంగా నీ గతం ఎంత చెడ్డదైనా, చిత్తశుద్ధితో చేసిన ఒక్క మంచి పని అయినా నిన్ను మంచివానిగా నిలబెట్టగలదు. అందుకే జనాభా అభిప్రాయాలకు లొంగకుండా, వర్తమానంలో ధర్మాన్ని ఆచరించడమే నిజమైన జీవిత నిబంధనగా ముందుకు సాగాలి.

News November 15, 2025

బిహార్: ఎన్డీఏ విజయానికి కారణాలివే..

image

☞ మోదీ-నితీశ్ కాంబోకు ప్రజలు మొగ్గు చూపడం
☞ పెరిగిన మహిళా ఓటర్ల శాతం
☞ మహిళా సంక్షేమ పథకాల అమలు
☞ ఎన్నికలకు ముందు 25 లక్షలకు పైగా మహిళల ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేయడం
☞ ‘జంగల్ రాజ్’(RJD) పాలనపై ప్రజలకు నమ్మకం లేకపోవడం
☞ మహాగఠ్‌బంధన్‌ కూటమిలో సీట్ల కేటాయింపులో ఘర్షణ
☞ లాలూ యాదవ్ కుటుంబంలో తేజస్వీ, తేజ్ ప్రతాప్ మధ్య చీలికలు
☞ కలిసొచ్చిన డబుల్ ఇంజిన్ సర్కార్, వికసిత్ బిహార్ నినాదం

News November 15, 2025

పాపం తేజస్వీ.. సీఎం అవుదామనుకుంటే?

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<18289323>>ఫలితాలు<<>> RJD నేత తేజస్వీ యాదవ్‌కు పీడకలను మిగిల్చాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 75 చోట్ల విజయం సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో మరిన్ని సీట్లు పెరుగుతాయని, తమ కూటమి అధికారంలోకి వస్తుందని తేజస్వీ భావించారు. అంతేకాకుండా ఈసారి సీఎం కుర్చీ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు ఆర్జేడీకి 25 సీట్లు మాత్రమే కట్టబెట్టి ముఖ్యమంత్రి కావాలన్న తేజస్వీ ఆశలను ఆవిరి చేశారు.