News December 19, 2024
క్రేజ్‌ను క్యాచ్ చేసుకుంటోన్న CROCS
CROCS కంపెనీ చెప్పుల గురించి యువతకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది వీటిని ధరించేందుకు ఇష్టపడుతుంటారు. దీంతో ఈ అమెరికన్ కంపెనీ వ్యాపారం భారీగా పెరిగిపోతోంది. 2019లో $1.23 బిలియన్‌గా ఉన్న క్రాక్స్ బిజినెస్ 2023లో మూడింతలు పెరిగి $3.96 బిలియన్ల వ్యాపారం చేసింది. ఈ ఏడాది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ చెప్పుల ధర రూ.2500 – రూ.10000 వరకు ఉంటుంది.
Similar News
News January 22, 2025
కర్ణాటక ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి
కర్ణాటకలో జరిగిన <<15220489>>రోడ్డు ప్రమాదంలో <<>>ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని Xలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
News January 22, 2025
హైదరాబాద్‌లో HCL కొత్త టెక్ సెంటర్
HYDలో పెట్టుబడి పెట్టేందుకు మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ ముందుకొచ్చింది. హైటెక్ సిటీలో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని HCL ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న WEFలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుతో 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్‌తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.
News January 22, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.860 పెరిగి రూ.82,090 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 పెరిగి రూ.75,250కి చేరింది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,04,000గా ఉంది.