News September 23, 2024
3 రోజుల్లో పంట నష్టపరిహారం: మంత్రి పొంగులేటి
TG: కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో బీఆర్ఎస్ నేతల్లా తాము దోచుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నెలలు గడిచినా పంట నష్ట పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ చేయకుండా మోసం చేశారని విమర్శించారు. 3 రోజుల్లో పంట నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారు. అమృత్ టెండర్లలో తన సవాల్‌ను కేటీఆర్ స్వీకరించలేదని అన్నారు.
Similar News
News October 11, 2024
9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం తాగేశారు
TG: దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రేపు దసరా కావడంతో ఈ మూడు రోజుల్లో సేల్స్ ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.350 కోట్ల అమ్మకాలు అదనంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ సారి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
News October 11, 2024
తుఫాను ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు
AP: రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
News October 11, 2024
మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే ఆఖరు
AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 చోట్ల షాపులకు ఒక్కోటి చొప్పున, 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.