News September 7, 2024
వీళ్లకే పంటనష్ట పరిహారం
TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. కనీసం 33% నష్టపోయిన పంటలకు పరిహారం అందజేయాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఈనెల 12లోగా వివరాలు అందజేయాలని ఆదేశించింది. వాటిని జిల్లా అధికారులు నిర్ధారించి, కలెక్టర్లకు పంపాలని పేర్కొంది. వారి ఆమోదంతో అర్హులైన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదనలు పంపాలంది.
Similar News
News October 7, 2024
మీ భార్యను మీరే ఇందులోకి లాగారు: సిద్దరామయ్యపై HD ఫైర్
కర్ణాటక CM సిద్దరామయ్యపై JDS లీడర్, కేంద్రమంత్రి HD కుమారస్వామి ఫైరయ్యారు. ‘ఇంట్లో ఉన్న మీ భార్యను మీరే ముడా స్కామ్‌లోకి లాగారు. మీరు చేసిన తప్పులే దానికి కారణం. పైనుంచి మమ్మల్ని ఆరోపిస్తున్నారు’ అని దుయ్యబట్టారు. తన భార్య విషయంలో ప్రతిపక్షాన్ని ప్రజలు క్షమించగలరా అని సిద్దరామయ్య చేసిన ఎమోషనల్ స్పీచ్‌పై HD ఇలా స్పందించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులపైనా డిబేట్‌కి రావాలని ఆయన CMకు ఛాలెంజ్ చేశారు.
News October 7, 2024
నేడు అకౌంట్లలోకి డబ్బులు
AP: సాంకేతిక కారణాలతో వరద పరిహారం అందని బాధితులకు నేడు ప్రభుత్వం డబ్బులు చెల్లించనుంది. ఎన్టీఆర్ జిల్లాల్లో 15వేలు, అల్లూరి జిల్లాలో 4,620 మంది, ఇతర జిల్లాల్లోని పలువురు బాధితుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. వీరందరికి దాదాపు రూ.18 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 98 శాతం మంది బాధితులకు రూ.584 కోట్ల పరిహారం చెల్లించిన విషయం తెలిసిందే.
News October 7, 2024
ఇకపై శ్రీవారి లడ్డూలు వేగంగా పంపిణీ
AP: భక్తులకు శ్రీవారి లడ్డూలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దర్శన టికెట్ లేని భక్తులు తమ ఆధార్ కార్డును కౌంటర్‌లో ఇస్తే అందులోని వివరాలు ఎంటర్ చేసుకుని 2 లడ్డూలు ఇస్తున్నారు. దీనివల్ల ఎక్కువ సమయం వృథా అవుతోంది. దీంతో ఆధార్‌ను క్షణాల్లో స్కాన్ చేసే అధునాతన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.