News March 24, 2024
చంద్రబాబు నివాసం వద్ద ఆశావహుల సందడి
AP: ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి ఆశావహులు క్యూ కట్టారు. టీడీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థుల చివరి జాబితా త్వరలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజుకు సీటివ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు. విజయనగరం పార్లమెంట్ సీటు కోసం కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి కోరారు. భీమిలి టికెట్ కోసం కోరాడ రాజబాబు ప్రయత్నిస్తున్నారు.
Similar News
News November 11, 2024
ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్ కొట్టివేత
లైంగిక వేధింపుల కేసులో కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. పలువురు మహిళలపై ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో వీడియోలు బయటికొచ్చాయి. దీంతో ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మేలో అరెస్ట్ చేశారు.
News November 11, 2024
ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపా: CM
TG: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 కూడా నిర్వహించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 2011లో చివరిసారిగా గ్రూప్-1 నిర్వహించారని, దాదాపు 13 ఏళ్ల పాటు పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపానని, ఎంపికైన వారికి త్వరలో నియామకపత్రాలు అందిస్తానని పేర్కొన్నారు.
News November 11, 2024
KL రాహుల్ లాంటి ప్లేయర్ ఎన్ని జట్లకు ఉన్నారు: గంభీర్
ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న KL రాహుల్‌కు కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచారు. అతడిలాంటి ప్లేయర్ అసలు ఎన్ని జట్లకు ఉన్నారని ప్రశ్నించారు. ‘KL ఓపెనింగ్ నుంచి 6డౌన్ వరకు బ్యాటింగ్ చేస్తారు. అలా ఆడాలంటే స్పెషల్ టాలెంట్ కావాలి. పైగా వన్డేల్లో కీపింగ్ చేయగలరు. రోహిత్ లేకుంటే ఓపెనర్‌గా అతడూ ఓ ఆప్షన్’ అని BGT సిరీసుకు ముందు గౌతీ అన్నారు. చాన్నాళ్లుగా KL రన్స్ చేయలేక జట్టులోకి వస్తూ పోతూ ఉన్నారు.