News November 3, 2024

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం, ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తాత్కాలికంగా సర్వ దర్శనాలు రద్దు చేశారు. మరోవైపు స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.

Similar News

News November 25, 2025

సిరిసిల్ల: ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

image

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అందే నీరజ(27) మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, మృతురాలి భర్త దేవరాజ్ గల్ఫ్ దేశంలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు.

News November 25, 2025

కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

గువాహటిలోని <>కాటన్ యూనివర్సిటీ<<>> 3 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27, 28 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, MCA, PGDCA/DCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.cottonuniversity.ac.in

News November 25, 2025

టీమ్ ఇండియాకు షాక్.. 2 వికెట్లు డౌన్

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 549 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 21 రన్స్‌కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ 13, కేఎల్ రాహుల్ 6 పరుగులకే ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. జాన్సెన్, హార్మర్ తలో వికెట్ తీశారు. భారత్ విజయానికి మరో 527 రన్స్ కావాలి.