News June 15, 2024
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కళ్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, మంచినీటిని టీటీడీ పంపిణీ చేస్తోంది.
Similar News
News November 23, 2025
అచ్చంపేట: యువకుడిపై పోక్సో కేసు నమోదు

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>


