News June 15, 2024
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
AP: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కళ్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, మంచినీటిని టీటీడీ పంపిణీ చేస్తోంది.
Similar News
News September 20, 2024
ఆందోళన విరమించిన కోల్‌కతా వైద్యులు
కోల్‌కతాలో RG కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో న్యాయం కోసం పోరాడుతున్న జూనియర్ వైద్యులు తమ నిరసనల్ని విరమించారు. ఇటీవల వారు రాష్ట్ర సర్కారుతో జరిపిన చర్చలు ఫలవంతమైనట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నిరసనలకు స్వస్తి పలికి శనివారం నుంచి విధులకు హాజరవుతామని వారు ప్రకటించారు. అత్యవసర సేవల్ని ప్రారంభిస్తామని, ఓపీడీ సేవల నిలిపివేత మాత్రం కొనసాగుతుందని తెలిపారు.
News September 20, 2024
రాజకీయాల నుంచి ఆలయాలకు స్వేచ్ఛ ఇవ్వాలా?
తిరుపతి లడ్డూ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ రాజకీయ విమర్శలతో ఆలయాలకు స్వేచ్ఛ అవసరమనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల నియంత్రణ నుంచి ఆలయాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని భక్తులు, నెటిజన్లు కోరుతున్నారు. కోట్ల మంది మనోభావాలు, నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిన ఆలయాలకు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 20, 2024
అమెరికా పిల్లల్లో వింత వైరస్ వ్యాప్తి
అమెరికాలో ఓ కొత్త వైరస్ పిల్లలపై దాడి చేస్తోంది. శ్వాసకోసపై దాడి చేసి వారిలో పోలియో తరహాలో పక్షవాతాన్ని కలుగజేస్తోందని అక్కడి పరిశోధకులు తెలిపారు. చిన్నారుల్లో నరాల సంబంధిత సమస్యల్ని తీసుకొచ్చే ఎంటెరోవైరస్ డీ68 స్ట్రెయిన్‌ను దేశవ్యాప్తంగా మురుగునీటిలో గుర్తించినట్లు వెల్లడించారు. పిల్లల కాళ్లూచేతులు చచ్చుబడిపోతున్నాయని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని ఆవేదన వ్యక్తం చేశారు.