News November 30, 2024
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,417 మంది భక్తులు దర్శించుకోగా 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు చేకూరింది.
Similar News
News November 30, 2024
ఇంద్రధనుస్సు రంగులో మొక్కజొన్నను చూశారా?
సాధారణంగా మొక్కజొన్న కంకులు పచ్చరంగులోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే, అమెరికాలో పండే హెర్లూమ్ మొక్కజొన్న ఇంద్రధనుస్సు రంగులతో ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని ఫొటోలను నెటిజన్లు ట్వీట్స్ చేస్తూ ‘ఇంత అందంగా ఉంటే ఎలా తింటాము’ అని పోస్టులు పెడుతున్నారు. దీనిని అక్కడి ప్రజలు ‘ఇండియన్ కార్న్’ అని పిలుస్తుంటారు. కార్న్ లియోన్ బర్న్స్ అనే వ్యక్తి ఈ మొక్కజొన్నను సృష్టించారు.
News November 30, 2024
అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి
అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రాపర్తినగర్కు చెందిన నూకరపు సాయితేజ (26)చనిపోయాడు. సాయితేజ MS చదవడానికి 4 నెలల క్రితమే US వెళ్లాడు. అతడు షాపింగ్ మాల్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
News November 30, 2024
రెండో టెస్టులో ఆ ముగ్గురిపై వేటు పడొచ్చు: గవాస్కర్
డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో రోహిత్ శర్మ, గిల్, రవీంద్ర జడేజా ఎంట్రీ ఖాయమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, ఫస్ట్ డౌన్లో గిల్ బ్యాటింగ్ చేస్తారన్నారు. పడిక్కల్, జురెల్, వాషింగ్టన్ సుందర్ బెంచ్కు పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.