News November 30, 2024
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,417 మంది భక్తులు దర్శించుకోగా 23,096 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు చేకూరింది.
Similar News
News February 8, 2026
T20 వరల్డ్ కప్: గుల్బదిన్ మెరుపులు.. న్యూజిలాండ్ లక్ష్యం 183

చెన్నైలో జరుగుతున్న T20 WC గ్రూప్-D మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ గుల్బదిన్ నైబ్ (63) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. అటల్ (29), గుర్బాజ్ (27) రాణించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా రవీంద్ర, డఫీ, హెన్రీ తలో వికెట్ పడగొట్టారు.
News February 8, 2026
మీరెవరైనా ఆ టేస్ట్ చూశారా..?

90s కిడ్స్.. ఈ ప్రశ్న మీ కోసమే. ఎలక్ట్రానిక్ వస్తువుల్లోని బ్యాటరీలు డ్రై అయ్యాయని ఎలా తెలుసుకుంటాం? మీకు ఐడియా ఉందా..? బ్యాటరీ చివరను నాలుకకు తగిలిస్తే ఒక రకమైన వగరు రుచి వస్తే అది పనిచేస్తుందని నిర్ధారించేస్తాం. బ్యాటరీ డెడ్ అయితే ఏమీ రాదు. మనలో చాలామంది ఈ టేస్ట్-టెస్ట్ రిజల్ట్ ఇచ్చినవాళ్లమే కదా. మీరు అప్పట్లో సైంటిస్టులా ఈ ప్రయోగం చేశారా? మీ మధుర జ్ఞాపకాలు కామెంట్ చేయండి.
News February 8, 2026
ఫోలిక్ యాసిడ్ అందరికీ అవసరమే

ఫోలిక్ యాసిడ్ గర్భిణులకే కాక అందరికీ అవసరమేనంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఫోలిక్ యాసిడ్ వల్ల పెద్దపేగు, గర్భాశయ, క్లోమ గ్రంథి క్యాన్సర్లు, అల్జీమర్స్ రాకుండా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఆకుకూరలు, చిక్కుడు జాతి గింజలు, పప్పులు, సిట్రస్ ఫ్రూట్స్, టమాటా, మటన్ లివర్, బ్రౌన్ రైస్, పల్లీలు, పుట్టగొడుగులు, బొప్పాయి, క్యారెట్లు, బీట్ రూట్, పచ్చి బఠానీల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.


