News April 11, 2024
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,570 మంది భక్తులు దర్శించుకోగా.. 24,446 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు సమకూరింది.
Similar News
News March 24, 2025
SHOCK: 40% స్టూడెంట్ వీసాల్ని రిజెక్ట్ చేసిన US

అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యార్థులకు షాక్. US అడ్మినిస్ట్రేషన్ రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను తిరస్కరిస్తోంది. తాజాగా ఈ రిజెక్షన్ రేటు 40%కి చేరడం గమనార్హం. FY2023-24లో 6.79 లక్షల దరఖాస్తులు రాగా అందులో 2.79 లక్షల వీసాలను తిరస్కరించినట్టు తెలిసింది. US జారీ చేసే స్టూడెంట్ వీసాల్లో 90% వరకు F1 ఉంటాయి. 2023లో లక్ష మందికి F1 వీసాలు రాగా 2024 JAN – SEP కాలంలో ఇవి 64,008కి తగ్గిపోయాయి.
News March 24, 2025
స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్: సీఎం

AP: ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలల్లో తప్పనిసరిగా వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంచినీటిని నిత్యం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ‘ఉపాధి హామీ కూలీలు ఉ.6 నుంచి 11 గంటల్లోపే పనులు ముగించుకునేలా చూడాలి. మున్సిపల్ కార్మికులకు మ.12 నుంచి సా.4గంటల్లోపు పనులు అప్పగించొద్దు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి ₹39Cr విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.
News March 24, 2025
భూ రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు ఎప్పుడంటే?

TG: ఎల్‌ఆర్ఎస్ గడువు పెంపు ఆలోచన ప్రస్తుతానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ తప్పనిసరని చెప్పారు. భూమికి మ్యాప్ లేని వాళ్లకు సర్వే చేయించి నిర్ధారిస్తామన్నారు. త్వరలోనే భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరుగుతాయని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్‌కు స్లాట్ విధానాన్ని అమలు చేస్తామన్నారు.