News March 23, 2024

ప్రణీత్ కేసులో కీలక మలుపు

image

TG: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబీ డీఎస్పీ తిరుపతన్న, HYD మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభాకర్ రావు, రాధాకిషన్ ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు.

Similar News

News September 16, 2024

చర్చలకు ఇదే చివరి అవకాశం.. వైద్య బ‌ృందాలకు బెంగాల్ ప్రభుత్వం అల్టిమేటం

image

జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌తో చ‌ర్చ‌ల‌కు బెంగాల్ ప్ర‌భుత్వం ఐదోసారి ఆహ్వానం పంపింది. ఇదే చివ‌రిసార‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ఇదివ‌ర‌కే ఒకసారి భేటీ అయినా వైద్యుల బృందం చేసిన డిమాండ్ల‌తో చ‌ర్చ‌లు ముందుకు సాగ‌లేదు. తాజాగా CM మ‌మ‌త‌తో చ‌ర్చ‌ల‌కు సా.5 గంట‌లకు కాళీఘాట్‌లోని ఆమె నివాసానికి రావాల్సిందిగా ప్రభుత్వం కోరింది. మీటింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉండదని, మినిట్స్ విడుదల చేస్తామని తేల్చిచెప్పింది.

News September 16, 2024

బాగా అలసిపోతున్నారా.. రీజన్స్ ఇవే

image

* శక్తికి మించి శ్రమించడం * భావోద్వేగ, మానసిక ఒత్తిడి * నిద్రలేమి * బోర్ కొట్టడం * వైరల్ ఇన్ఫెక్షన్లు * యాంటీ డిప్రెసంట్స్ వంటి మందులు * విటమిన్లు, మినరల్స్, పోషకాలు లేని ఆహారం * కీమోథెరపీ వంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ * డిప్రెషన్ * యాంగ్జైటీ * గుండె, థైరాయిడ్, డయాబెటిస్, ఆర్థరైటిస్, పార్కిన్‌సన్స్, అనీమియా వంటి క్రానిక్ డిసీజెస్ * చికిత్స తీసుకోకుండా భరిస్తున్న నొప్పులు * మితిమీరిన కెఫిన్, ఆల్కహాల్

News September 16, 2024

అవసరమైతే MLAగా పోటీ చేస్తా: మిథున్ రెడ్డి

image

AP: వక్ఫ్‌బోర్డు బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని YCP ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. పుంగనూరు మున్సిపల్ ఆఫీసులో YCP నేతలతో ఆయన సమావేశమయ్యారు. మైనారిటీలకు అండగా ఉంటామన్నారు. పుంగనూరు నియోజకవర్గ పునర్విభజనపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు. అవసరమైతే తానే వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నుంచి MLAగా పోటీ చేస్తానని తెలిపారు. పుంగనూరుని అభివృద్ధి చేస్తే టీడీపీ నేతలను తానే సన్మానిస్తానని చెప్పారు.