News May 23, 2024

సీఎస్‌ జవహర్‌ను తొలగించాలి: కనకమేడల

image

AP: పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్ రెడ్డిని బాధ్యుడిగా చేయాలని, ఆ పదవి నుంచి తొలగించాలని టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ‘హింసను ఆపడంలో సీఎస్ పూర్తిగా విఫలమయ్యారు. ఆయన్ను తొలగించకపోతే కౌంటింగ్ సమయంలోనూ ప్రభావం పడే అవకాశం ఉంది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై ఈసీ విచారణకు ఆదేశించాలి. ఆ ఘటనల వీడియోలను బయటపెట్టాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేవారికి రూ.25వేలు: మంత్రి

image

AP: రోడ్డు ప్రమాదాల్లో మొదటి గంటలోపు క్షతగాత్రులకు ‘PM రాహత్’ కింద ₹1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీరి వైద్యం ఖర్చు ఇంకా ఎక్కువైనా మిగతా మొత్తాన్ని NTR వైద్యసేవ కింద అందిస్తాం. రోడ్డు ప్రమాదాల బాధితులను ఆసుపత్రిలో చేర్పించే వారికిచ్చే ప్రోత్సాహకాన్ని ₹5వేల నుంచి 25వేలకు పెంచారు’ అని తెలిపారు. వీరికి పోలీసుల వైపు నుంచి సమస్య లేకుండా చూస్తామని చెప్పారు.

News April 16, 2026

మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా?.. లోకేశ్‌కు YCP కౌంటర్

image

AP: వైఎస్ జగన్ తల్లిని, చెల్లిని తరిమేశారంటూ మంత్రి లోకేశ్ చేసిన <<19664163>>విమర్శలకు<<>> వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా? ఏ రోజు అయినా ఇంటికి పిలిచి పట్టెడన్నం పెట్టావా? మీ బాబాయ్ రామ్మూర్తి నాయుడిని ఎందుకు గొలుసులతో కట్టేశారు? మీ నాన్నమ్మ చనిపోతే మీ నాన్న ఎందుకు తలకొరివి కూడా పెట్టలేదు? నువ్వు ఒకటి అంటే మేము పది అనగలం. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’ అని వార్నింగ్ ఇచ్చింది.

News April 16, 2026

SRHకు షాక్.. IPL నుంచి మరో బౌలర్ ఔట్

image

IPL: SRH బౌలర్ డేవిడ్ పేన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఆయన కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా అంతకుముందు గాయంతో టోర్నీకి దూరమైన జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో <<19463818>>పేన్<<>> జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.