News June 21, 2024
డయేరియాపై CS సమీక్ష.. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రచారం

AP: రాష్ట్రంలో డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలుచేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంచినీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఇందులో గ్రామవార్డు సచివాలయాల సిబ్బందిని, ANM అంగన్వాడీ సిబ్బందిని భాగం చేయాలన్నారు.
Similar News
News November 7, 2025
Fact Check: పాత ₹500, ₹1,000 నోట్లు మార్చుకోవచ్చా?

2016లో రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకటించిందంటూ ఓ వార్త వైరలవుతోంది. అయితే ఇదంతా ఫేక్ ప్రచారమని PIB Fact Check స్పష్టం చేసింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది. తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని ప్రజలకు సూచించింది. నోట్లకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా https://rbi.org.in/ నుంచి తెలుసుకోవాలని వెల్లడించింది.
News November 7, 2025
15 అడుగుల ఎత్తు పెరిగిన గోంగూర మొక్క

TG: గోంగూర పంట 35 రోజుల్లోగా కోతకు వస్తుంది. మహా అయితే 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అయితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మం. అప్పన్నపేటలోని కృష్ణారెడ్డి ఇంట్లో ఓ గోంగూర మొక్క ఏకంగా 15 అడుగుల ఎత్తు పెరిగింది. దీన్ని తొమ్మిది నెలల క్రితం నాటారు. ఇప్పటికీ ఈ మొక్కకు 25కుపైగా కొమ్మలు ఉండి గుబురుగా ఆకులు వస్తున్నాయి. ఈ మొక్క నుంచి వచ్చే ఆకులను సేకరించి ఇప్పటికీ కూరకు వాడుతున్నామని కృష్ణారెడ్డి తెలిపారు.
News November 7, 2025
ఎందరికో ఆదర్శం అరుణిమా సిన్హా జీవితం

జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్గా ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.


