News June 21, 2024
డయేరియాపై CS సమీక్ష.. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రచారం
AP: రాష్ట్రంలో డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలుచేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంచినీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఇందులో గ్రామవార్డు సచివాలయాల సిబ్బందిని, ANM అంగన్వాడీ సిబ్బందిని భాగం చేయాలన్నారు.
Similar News
News November 5, 2024
‘ఈ నగరానికి ఏమైంది2’ వచ్చేస్తోంది!
సైలెంట్‌గా వచ్చి యూత్‌ని బాగా ఎంటర్‌టైన్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’కి సీక్వెల్ రాబోతోంది. త్వరలోనే ‘ఈ నగరానికి ఏమైంది2’ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News November 5, 2024
పార్టీకి తక్కువ డబ్బిచ్చావన్నందుకు చంపేశాడు!
పార్టీ చేసుకున్నాక ఖర్చు షేర్ చేసుకోవడం కామన్. ఆ లెక్కల్లో తేడాలు వస్తే పెద్ద దుమారమే రేగుతుంది. MPలోని జబల్‌పూర్‌లో అదే జరిగింది. మనోజ్(26) తన మేనల్లుడు ధరమ్ ఠాకూర్(19) డియోరీ తపారియా అనే గ్రామంలో మందు, చికెన్‌తో పార్టీ చేసుకున్నారు. మందుకు ₹340, చికెన్‌కు ₹60 అయ్యింది. పార్టీ అయ్యాక ‘నువ్వు తక్కువ డబ్బు ఇచ్చావు’ అని మనోజ్ అనడంతో గొడవ మొదలైంది. కోపంతో ధరమ్ మేనమామ మనోజ్‌ను కర్రతో కొట్టి చంపాడు.
News November 5, 2024
నవంబర్ 5: చరిత్రలో ఈరోజు
* 1877: సంస్కృతాంధ్ర పండితులు పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
* 1920: ఇండియన్ ‘రెడ్‌క్రాస్’ ఏర్పడింది
* 1925: కవి, రచయిత ఆలూరి బైరాగి జననం
* 1987: మహాకవి దాశరథి కృష్ణమాచార్య మరణం
* 1988: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు(ఫొటోలో)
* 2019: నటుడు, దర్శకుడు కర్నాటి లక్ష్మీనరసయ్య మరణం