News April 12, 2025

CSK మరో చెత్త రికార్డు

image

ఐపీఎల్-2025లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ (245) ఆడిన జట్టుగా CSK నిలిచింది. నిన్న KKRతో ఆడిన మ్యాచులోనే 61 డాట్ బాల్స్ ఆడటం గమనార్హం. ఈ లిస్టులో CSK తర్వాత వరుసగా KKR (245), RR (206), RCB (202), MI (198), SRH (191), LSG (186), GT (167), PBKS (145), DC (123) ఉన్నాయి. ఐపీఎల్‌లో ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 మొక్కలను నాటుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 8, 2025

3 రోజుల్లో రూ.103 కోట్ల కలెక్షన్లు

image

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు 3 రోజుల్లో రూ.103 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. సినిమా విడుదలైన తొలిరోజు శుక్రవారం (రూ.28 కోట్లు) కంటే ఆదివారం (రూ.43 కోట్లు) ఎక్కువ వసూళ్లు వచ్చాయి. స్పై కథాంశంతో ఆదిత్య ధార్ ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం తెలుగులో విడుదల కాలేదు.

News December 8, 2025

మైక్రోసైటిక్ అనీమియా గురించి తెలుసా?

image

మైక్రోసైటిక్ అనీమియా వల్ల శరీరంలో రక్త కణాల పరిమాణం తగ్గుతుంది. దీంతో శరీరంలో ఆక్సిజన్ తగ్గి అలసట, మైకము, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమేకాకుండా అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ లోపం కారణంగా కూడా మైక్రోసైటిక్ అనీమియా తలెత్తే అవకాశం ఉంటుంది.

News December 8, 2025

ఈ హాస్పిటల్‌లో అన్నీ ఉచితమే..!

image

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్‌ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్‌ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.