News May 2, 2024
CT 2025: లాహోర్‌లో భారత్ మ్యాచ్‌లు: పీసీబీ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా తమ మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో ఆడొచ్చని PCB ప్రతిపాదించింది. భద్రతాపరంగా గడాఫీ స్టేడియం సురక్షితమైనదని తెలిపింది. అలాగే భారత్ నుంచి వాఘా బోర్డర్ మీదుగా వచ్చే ప్రేక్షకులకు కూడా లాహోర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేదే లేదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. దుబాయ్ లేదా ఆస్ట్రేలియాలో తమ మ్యాచ్‌లు ఆడాలని భారత్ భావిస్తోంది.
Similar News
News March 4, 2026
డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, SPSR నెల్లూరులో ఉద్యోగాలు

<
News March 4, 2026
పంచాయతీల్లో ‘పంచాయితీ’!

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.
News March 4, 2026
2వేల టార్గెట్లను ధ్వంసం చేశాం: US మిలిటరీ

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్‌లోని 2వేల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఆ దేశ నేవీకి చెందిన ఒక సబ్‌మెరైన్ సహా 17 యుద్ధనౌకలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో ఒక్క ఇరాన్ షిప్పు కూడా లేదని తెలిపింది. మరోవైపు నేవీతో పాటు ఇరాన్ మిస్సైల్ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బ తీసేలా అమెరికా దాడులు చేస్తోంది.


