News March 7, 2025

CT ఫైనల్: కుల్దీప్ ప్లేస్‌లో సుందర్?

image

ఎల్లుండి NZతో జరిగే CT ఫైనల్‌లో IND జట్టులో ఒక మార్పు జరిగే ఛాన్సుంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న స్పిన్నర్ కుల్దీప్ స్థానంలో సుందర్‌ను జట్టులోకి తీసుకుంటారని సమాచారం. NZలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువగా ఉండటంతో రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్‌ను ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుందర్ ఆడితే బ్యాటింగ్ బలం కూడా పెరగనుంది. అటు NZలో యంగ్ స్థానంలో కాన్వే ఆడొచ్చు.

Similar News

News January 15, 2026

ఇరాన్ పాలకులు మారితే ఇండియాకు నష్టమా?

image

ఇరాన్‌లో పాలనాపగ్గాలు మారితే భారత్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మన దేశం నుంచి అఫ్గానిస్థాన్, సెంట్రల్ ఆసియాకు వెళ్లే మార్గాన్ని పాకిస్థాన్ మూసేసింది. ఇరాన్ నుంచే వెళ్తున్నాం. కొత్త పాలకులు వస్తే ఏం చేస్తారనేది సస్పెన్సే. అలాగే ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్ట్ సందిగ్ధంలో పడుతుంది. ఇరాన్ బలహీనపడితే సున్నీ మెజారిటీ ఉన్న పాకిస్థాన్ బలపడే ఛాన్సుంది.

News January 15, 2026

బీసీలకు 42% సీట్లు.. పార్టీలు ఇచ్చేనా?

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో SC ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించకుండా అమలు చేశారు. BCలకు 42% స్థానాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, BRSకు ఇదో అవకాశంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో 32%(38 స్థానాలు) కార్పొరేషన్‌లో 30%(3 చోట్ల) కేటాయించింది. కాగా హామీని నెరవేర్చేందుకు మరో 12 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలోనూ BC అభ్యర్థులనే ప్రకటించాల్సి ఉంది. మరి పార్టీలు ఎలాంటి ప్రకటన చేస్తాయో చూడాలి.

News January 15, 2026

కనుమ రోజు గారెలు తింటున్నారా?

image

కనుమ నాడు మినుము తింటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే మినుము తిన్నవాళ్లు ఇనుములా ఉంటారని మరో సామెత. చాలామంది కనుమరోజు కచ్చితంగా గారెలు తినేలా చూసుకుంటారు. అయితే పొట్టు తియ్యని మినుముల్లో పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పొట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పొట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో మాంసకృత్తులతోపాటు అనేక రకాలప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి.