News March 7, 2025
CT ఫైనల్: కుల్దీప్ ప్లేస్‌లో సుందర్?

ఎల్లుండి NZతో జరిగే CT ఫైనల్‌లో IND జట్టులో ఒక మార్పు జరిగే ఛాన్సుంది. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్న స్పిన్నర్ కుల్దీప్ స్థానంలో సుందర్‌ను జట్టులోకి తీసుకుంటారని సమాచారం. NZలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువగా ఉండటంతో రైటార్మ్ ఆఫ్ స్పిన్నర్‌ను ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుందర్ ఆడితే బ్యాటింగ్ బలం కూడా పెరగనుంది. అటు NZలో యంగ్ స్థానంలో కాన్వే ఆడొచ్చు.
Similar News
News March 23, 2025
27న పోలవరానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
News March 23, 2025
కోర్ట్.. 9 రోజుల్లో రూ.46.80 కోట్లు

రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 9 రోజుల్లోనే రూ.46.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇవాళ్టితో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.
News March 23, 2025
ఎన్నికల్లో కపట హామీలు.. గెలిచాక ఊసే ఉండదు: వైసీపీ

AP: చంద్రబాబు 40 ఏళ్లుగా మోసపూరిత రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారని YCP విమర్శించింది. ఎన్నికల్లో కపట హామీలు ఇచ్చి గెలిచాక వాటి ఊసే ఎత్తని సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. వాలంటీర్లు, ఏపీ అప్పు, సూపర్ 6, భృతి, ఉచిత బస్సు, పోలవరం విషయంలో మోసం చేశారని ఆరోపించింది. ఇప్పటికే మండలిలో ప్రభుత్వాన్ని YCP ప్రశ్నిస్తోందని, శాసనసభలోనూ ప్రతిపక్ష హోదా ఇస్తే మరింత నిలదీస్తారని CBN భయపడుతున్నారని పేర్కొంది.