News February 7, 2025

CT: పాకిస్థాన్ జెర్సీ ఆవిష్కరణ

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు హోస్ట్ పాకిస్థాన్ తన జెర్సీ ఆవిష్కరించింది. గత జెర్సీకి భిన్నంగా దీనిని రూపొందించారు. కాగా ఇవాళ లాహోర్‌లోని గడాఫీ స్టేడియాన్ని PCB పున:ప్రారంభించింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ మైదానాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. కొత్త ఫ్లడ్‌లైట్లు, సీట్లు, ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డులు, ఎల్ఈడీ టవర్లు, వీవీఐపీ బాక్సులు వంటివి నిర్మించారు. కాగా పాక్ ఆటగాళ్ల జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News April 10, 2026

IPL: టాస్ గెలిచిన రాజస్థాన్

image

గువాహటిలో బెంగళూరుతో మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
జట్లు:
RCB: కోహ్లీ, సాల్ట్, పడిక్కల్, పాటీదార్, జితేశ్, టిమ్ డేవిడ్, షెపర్డ్, కృనాల్, భువనేశ్వర్, అభినందన్, హేజల్‌వుడ్.
RR: జైస్వాల్, జురెల్, పరాగ్, హెట్‌మెయిర్, ఫెరీరా, జడేజా, బర్గర్, ఆర్చర్, సందీప్ శర్మ, బిష్ణోయ్, బ్రిజేశ్.
* వైభవ్ IMPACT

News April 10, 2026

ఇరాన్‌ కొత్త నాయకత్వం ఇంకా డేంజర్: IDF

image

ఇరాన్‌లో ఇప్పుడున్న నాయకత్వం మరింత ఎక్స్‌ట్రీమ్‌గా ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) హెచ్చరించింది. ఖమేనీ చనిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త లీడర్‌షిప్ సంప్రదాయ మత పెద్దల నుంచి కాకుండా IRGC నుంచి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రహస్య సమావేశంలో IDF ప్రతినిధులు పార్లమెంటు ఫారిన్ అఫైర్స్ కమిటీకి తెలియజేశారు. ఈ క్రమంలో యుద్ధం తిరిగి ప్రారంభం కావచ్చని కమిటీ చీఫ్ బోవజ్ బిస్ముత్ అభిప్రాయపడ్డారు.

News April 10, 2026

IPL: రాత్రి 8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం

image

IPL అభిమానులకు గుడ్‌న్యూస్. RCB-RR మ్యాచ్ జరగాల్సిన గువాహటి స్టేడియం వద్ద వర్షం తగ్గింది. సిబ్బంది కవర్లు తొలగించారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అంపైర్లు రా.8 గంటలకు టాస్ వేయనున్నారు. రా.8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పూర్తి ఓవర్ల గేమ్ జరగనుంది.