News January 10, 2025

CT: అఫ్గాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలి.. SA మంత్రి వినతి

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్‌తో మ్యాచ్‌ను సౌతాఫ్రికా జట్టు బాయ్‌కాట్ చేయాలని ఆ దేశ స్పోర్ట్స్ మినిస్టర్ గేటన్ మెకెంజీ కోరారు. అఫ్గాన్‌లో అధికారం చేపట్టినప్పటి తాలిబన్ ప్రభుత్వం మహిళా క్రీడలపై బ్యాన్ విధించిందన్నారు. అఫ్గాన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌పైనా ఆంక్షలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. తాలిబన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాయ్‌కాట్ చేయాలన్నారు. కాగా CTలో భాగంగా ఫిబ్రవరి 21న SA-AFG తలపడనున్నాయి.

Similar News

News January 22, 2025

BRSకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

image

TG: బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. బీఆర్ఎస్ నల్లగొండ దీక్షకు కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా సభ నిర్వహించుకోవాలని సూచించింది. కాగా ఈ నెల 21న నల్లగొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కానీ స్థానిక పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

News January 22, 2025

ఎలా ఆడాలో రోహిత్‌కు చెప్పక్కర్లేదు: రహానే

image

రోహిత్ శర్మ పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నారు. రేపు J&Kతో మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ రహానే మాట్లాడుతూ ‘రోహిత్ ఏంటో అందరికీ తెలుసు. నేషనల్, ఇంటర్నేషనల్ ఏ మ్యాచ్ ఆడినా ఒకేలా ఉంటాడు. ఆట గురించి అతనికి బాగా తెలుసు. ఏం చేయాలో ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. అతడిచ్చే ఇన్ పుట్స్ మాకు చాలా ముఖ్యం. రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకముంది’ అని చెప్పారు.

News January 22, 2025

ఆయుష్మాన్ భారత్‌కు ‘ఆప్‌’ద అడ్డంకులు: మోదీ

image

ఆమ్‌ఆద్మీ వంచన, అబద్ధాలకు శీశ్‌మహలే పెద్ద ఉదాహరణ అని PM మోదీ అన్నారు. ఢిల్లీ BJP కార్యకర్తలతో మాట్లాడారు. ‘ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని ‘ఆప్‌’ద మనుషుల్ని కోరాం. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఎన్నో ప్రయోజనాలున్న ఈ స్కీమ్ అమలుకు ఆప్‌ద అడ్డంకులు సృష్టించింది. భారత ఎకానమీకి మిడిల్‌క్లాసే వెన్నెముకని బీజేపీ భావిస్తుంది. వారి ఆశలు, ఆశయాలను మనం అర్థం చేసుకున్నాం’ అని అన్నారు.