News January 9, 2025

CTET ఫలితాలు విడుదల

image

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 31వ తేదీన కీని విడుదల చేసి, జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థులు రోల్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 13, 2025

ఇవాళ హైడ్రా ప్రజావాణికి సెలవు

image

TG: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సంక్రాంతి సెలవుల కారణంగా ఇవాళ ఉండదని హైడ్రా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ సెలవులలో ప్రజావాణి నిర్వహించట్లేదని గతంలోనే ప్రకటించినట్లు తెలిపింది. వచ్చే సోమవారం(20.01.2025) తిరిగి నిర్వహిస్తామని పేర్కొంది.

News January 13, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 13, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.25 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
✒ ఇష: రాత్రి 7.17 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 13, 2025

భోగి మంటల వెనుక శాస్త్రీయ కోణం!

image

భోగీ నాడు ఊరువాడ భోగి మంటలు వేయడం అనవాయితీగా ఉన్నా దీనికి శాస్త్రీయ కోణం ఉంది. ఈ మంటలు వేయడం వల్ల పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా సామాజిక బంధాలు బలపడతాయి. అందరూ ఒక చోట చేరడంతో ఐక్యత పెరుగుతుంది. చలి కాలంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఇంట్లోని చెత్తను నిర్మూలించడమే కాకుండా ఈ బూడిద నుంచి పోటాషియం వంటి ఖనిజాలు మట్టికి అందుతాయి. ఈ మంటల్లో పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ది అవుతుంది.