News March 28, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కస్టడీ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు కోర్టు కస్టడీ విధించింది. అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగరావుకు 5 రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. కానీ ప్రణీత్ రావు కస్టడీకి కోర్టు అనుమతించలేదు. కాగా నిందితులంతా తమ సొంత అవసరాలకు కూడా ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు, హవాలా దందా చేసేవారిని బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News March 9, 2026
ఆ తేదీల్లో రికమండేషన్ లెటర్లు అంగీకరించం: TTD

AP: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా ఈ నెల 17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD తెలిపింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొంది. అయితే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.
News March 9, 2026
ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

సూరత్(గుజరాత్)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.
News March 9, 2026
విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.


