News August 14, 2024
6 నెలలు రేషన్ తీసుకోని కార్డులు కట్!
AP: జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1,36,420 కార్డుదారులు 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్రం గుర్తించింది. దీంతో వాటిని తొలగించి, రాష్ట్ర కార్డులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పౌరసరఫరాల శాఖ నుంచి ప్రతిపాదనలూ అందాయి. మరోవైపు రేషన్ దుకాణాల్లో ప్రతినెలా బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Similar News
News September 10, 2024
నేడు తాడేపల్లికి జగన్ రాక
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు. అదే జైల్లో ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా జగన్ కలవనున్నారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
News September 10, 2024
చాకలి ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తి
భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరనారి చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం చేశారు. నిజాం నవాబుకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. కౌలు భూమిలో తాను పండించిన పంటను దేశ్‌ముఖ్ రేపాక రామచంద్రారెడ్డి తన అనుచరులతో తరలించుకుపోవడానికి ప్రయత్నించగా వారిని తరిమి కొట్టారు. ఇదే సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికింది. ‘బాంచన్ కాల్మొక్తా’ అనే బతుకులను మార్చడానికి ఐలమ్మ జీవితం త్యాగం చేశారు. నేడు ఆమె వర్ధంతి.
News September 10, 2024
టాప్ డైరెక్టర్లతో యంగ్‌టైగర్.. పిక్స్ వైరల్
టాప్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్, కొరటాల శివ, అయాన్ ముఖర్జీతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మూవీ ట్రైలర్ ఇవాళ ముంబైలో విడుదల కానుండటంతో వీరందరూ అక్కడ కలుసుకున్నారు. కాగా ఈ ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. కొరటాలతో ‘దేవర’, నీల్‌తో ‘NTR31’, అయాన్‌తో ‘వార్ 2’ సినిమాలు చేస్తున్నారు.