News March 27, 2025
చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరం: సుప్రీంకోర్టు

చట్టవిరుద్ధంగా నరికిన చెట్లకు ఒక్కో దానికి ₹లక్ష చొప్పున జరిమానా చెల్లించాలని UPకి చెందిన శివశంకర్ అగర్వాల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కన్నా ఘోరమని అభిప్రాయపడింది. అవి కల్పించే పచ్చదనాన్ని తిరిగి సృష్టించేందుకు కనీసం వందేళ్ల సమయం పడుతుందని పేర్కొంది. దాల్మియా వ్యవసాయ క్షేత్రంలోని 454 చెట్లను అగర్వాల్ నరికివేశాడు. దీంతో కోర్టు జరిమానా విధించింది.
Similar News
News April 19, 2025
బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్య

బంగ్లాలో హిందువులపై దాడి కొనసాగుతోంది. దీనాజ్‌పూర్ జిల్లాలో భాబేశ్ చంద్ర అనే హిందూ నేతను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషద్ సంస్థకు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. నలుగురు వ్యక్తులు బైక్స్‌పై వచ్చి ఆయన్ను కిడ్నాప్ చేశారని, మృతదేహాన్ని తిరిగి తీసుకొచ్చి ఇంటి ముందు పారేశారని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
News April 19, 2025
చియా సీడ్స్‌తో గుండె ఆరోగ్యం పదిలం!

చియా సీడ్స్ వల్ల శరీరానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా అందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి మెదడు, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని తెలుపుతున్నారు. 100గ్రా. చేపల్లో 200-300 మి.గ్రాముల ఒమేగా ఫ్యాట్ ఉంటుందని, అదే 100గ్రా. చియా సీడ్స్ ద్వారా 18గ్రా. లభిస్తుందని వివరిస్తున్నారు. గుండె ఆరోగ్యం కోసం, రక్తంలో మంచి కొవ్వులు పెరగడానికి రోజూ 2స్పూన్లు నానబెట్టుకొని తీసుకోవాలని సూచిస్తున్నారు.
News April 19, 2025
ఓ దశకు ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు: ట్రంప్

కాల్పుల విరమణపై ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఓ దశకు వచ్చాయని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దీర్ఘకాలిక వివాదాన్ని ముగించేందుకు తాను ఏ ఒక్కరికీ అనుకూలంగా లేనట్లు చెప్పారు. ఈ చర్చలను పుతిన్, జెలెన్‌స్కీలలో ఎవరు కష్టతరం చేసినా వారిని మూర్ఖులుగా పరిగణిస్తామన్నారు. ఆపై శాంతి ఒప్పందలో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతామని తెలిపారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమైతే US ముందడుగు వేస్తుందని వెల్లడించారు.