News March 8, 2025

CYBER CRIME: వృద్ధుల వాట్సాప్ హ్యాక్ చేసి!

image

వృద్ధులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వారి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి కాంటాక్ట్స్‌కు ఆర్థిక సహాయం చేయాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ ఫ్రాడ్‌ను ఓ నెటిజన్ లేవనెత్తుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలిసిన వృద్ధుడి అకౌంట్‌ను దుండగులు హ్యాక్ చేసి కాంటాక్ట్స్‌లోని చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.

Similar News

News March 6, 2026

కూలిన సుఖోయ్.. ధర ఎంత ఉంటుందంటే?

image

సుఖోయ్ ఫైటర్ జెట్ Su-30MKI నిన్న శిక్షణ సమయంలో అస్సాంలోని జోర్హట్‌కు 60KM దూరంలో కూలినట్లు ఇండియన్ ఫోర్స్ ధ్రువీకరించింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పింది. అయితే యుద్ధ విమానం ధర ఎంత ఉంటుందనే చర్చ జరుగుతోంది. గతేడాది భారత్ 12 ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చి రూ.13,500CR కేటాయించింది. దాని ప్రకారం ఒక్కో Su-30MKI రూ.1,000కోట్లకు పైగా ఉంటుంది. ప్రస్తుతం IND వద్ద 260+ సుఖోయ్ జెట్లు ఉన్నాయి.

News March 6, 2026

బుమ్రా అందుకు అర్హుడు: సంజూ శాంసన్

image

T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై <<19308021>>ఉత్కంఠ పోరు<<>>లో టీమ్ ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. చివర్లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను మన కంట్రోల్‌లోకి తెచ్చిన బుమ్రాపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించారు. ‘బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. అతడు అలా బౌలింగ్ చేయకపోయి ఉంటే నేను POTMను అందుకునే వాడిని కాదు. ఈ అవార్డుకు నా కన్నా తనే ఎక్కువ అర్హుడు. డెత్ ఓవర్లలో అసాధారణ ప్రదర్శన చేశాడు’ అని కొనియాడారు.

News March 6, 2026

మొక్క జొన్న రైతుల బకాయిలు విడుదల

image

TG: మొక్క జొన్న రైతుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మార్క్‌ఫెడ్‌కు ₹171 కోట్లు రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకటీరెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. ‘వానాకాలానికి సంబంధించి 78,500 మంది నుంచి 3.77 లక్షల టన్నుల మొక్కజొన్నలు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. తొలిదశలో ₹735.39 కోట్లు చెల్లించాం. మిగతా నిధులను తాజాగా రిలీజ్ చేశాం’ అని పేర్కొన్నారు.