News March 8, 2025
CYBER CRIME: వృద్ధుల వాట్సాప్ హ్యాక్ చేసి!

వృద్ధులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వారి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి కాంటాక్ట్స్‌కు ఆర్థిక సహాయం చేయాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ ఫ్రాడ్‌ను ఓ నెటిజన్ లేవనెత్తుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలిసిన వృద్ధుడి అకౌంట్‌ను దుండగులు హ్యాక్ చేసి కాంటాక్ట్స్‌లోని చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.
Similar News
News February 16, 2026
154 పోస్టులు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)లో 154 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, MLT, BE/BTech, MSc, MA/MSW, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/ అసెస్‌మెంట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.becil.com
News February 16, 2026
అరటి సాగు: పిలకల ఎంపిక, నాటడంలో జాగ్రత్తలు

ఆరోగ్యవంతమైన అరటి తోటల నుంచే పిలకలను ఎంపిక చేయాలి. 3 నెలల వయసు, 2 లేదా 3 కోతలు పడిన సూడి పిలకలను ఎన్నుకోవాలి. పిలకలపై చర్మాన్ని పలచగా చెక్కి లీటరు నీటికి 2.5ml మోనోక్రోటోపాస్, కాపర్ ఆక్సీక్లోరైడ్ 5గ్రా. కలిపిన ద్రావణంలో 15 ని. ముంచి నాటాలి. పొట్టి పచ్చ అరటిని 1.5X1.5 మీ. దూరంలో, గ్రాండ్ నైన్, తెల్లచక్కెరకేళిని 1.8×1.8 మీ.. మార్టిమాన్, కర్పూర చక్కెరకేళి, కొవ్వూరు బొంతలను 2×2 మీ. దూరంలో నాటాలి.
News February 16, 2026
కాకులకు ఆహారం పెట్టడం అశుభమా?

కాకులకు ఆహారం పెడితే కీడు జరుగుతుందనేది అపోహేనని పండితులు చెబుతున్నారు. ‘కాకి కూడా విశేషమైన జీవి. పితృదేవతలు కాకి రూపంలోనే వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తారు. అంతటి గొప్ప జీవి కాకి. తోటి జీవులతో ఆహారాన్ని పంచుకునే గుణం వాటి సొంతం. అలాంటి కాకికి ఆహారం పెట్టడం పుణ్యమే కానీ, దోషం కాదు. ఏ మూగజీవి ఆకలి తీర్చినా అది దేవుడికి ప్రీతికరమే. కాబట్టి ఏమాత్రం సంకోచించకుండా వాటికి ఆహారం అందించవచ్చు’ అంటున్నారు.


