News August 6, 2024

సైబర్ నేరాలు: మొదటి గంట చాలా ముఖ్యం!

image

TG: సైబర్ మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నవారు మొదటి గంటలోనే(గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయాలని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TSCSB) సూచించింది. ఇలా చేస్తే నేరగాళ్లకు డబ్బు చేరకుండా ఆపగలమని తెలిపింది. లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో TSCSB మార్చి-జులై మధ్య రూ.85.05కోట్ల నగదును రీఫండ్ చేసింది. మొత్తం 6,449 కేసులను పరిష్కరించింది. బాధితులు 1930 నంబర్, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు.

Similar News

News April 6, 2026

ఏప్రిల్ 6: చరిత్రలో ఈరోజు

image

1886: HYD చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జననం
1896: ఏథెన్స్‌లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభం
1928: DNA నిర్మాణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జననం
1938: కీటక శాస్త్రవేత్త, పద్మశ్రీ&పద్మభూషణ్ అవార్డుల గ్రహీత వినోద్ ప్రకాశ్ శర్మ జననం
1956: భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ జననం
2011: సినీ నటి సుజాత మరణం (ఫొటోలో)

News April 6, 2026

PHOTO GALLERY: చెన్నైvsRCB మ్యాచ్

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన CSKvsRCB మ్యాచుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, RCB ఓనర్ అనన్య బిర్లా, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వంటి ప్రముఖులు సైతం మ్యాచును ఎంజాయ్ చేశారు. 2024 సీజన్ నుంచి చెన్నైపై RCBకి ఇది వరుసగా నాలుగో విజయం. ఈ మ్యాచ్ ఓడటానికి తానే కారణమని, బ్యాటింగ్‌లో తాను మంచి స్కోర్ చేయాల్సిందని CSK కెప్టెన్ రుతురాజ్ అన్నారు.

News April 6, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.