News August 6, 2024

సైబర్ నేరాలు: మొదటి గంట చాలా ముఖ్యం!

image

TG: సైబర్ మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నవారు మొదటి గంటలోనే(గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయాలని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(TSCSB) సూచించింది. ఇలా చేస్తే నేరగాళ్లకు డబ్బు చేరకుండా ఆపగలమని తెలిపింది. లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో TSCSB మార్చి-జులై మధ్య రూ.85.05కోట్ల నగదును రీఫండ్ చేసింది. మొత్తం 6,449 కేసులను పరిష్కరించింది. బాధితులు 1930 నంబర్, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు.

Similar News

News September 19, 2024

బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు: TTD అదనపు ఈవో

image

AP: తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8న నిర్వహించే గరుడ వాహన సేవ ఏర్పాట్లపై TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష జరిపారు. ఆ రోజున భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయం(OCT 4-12)లో ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. OCT 7న ఉ.6 గంటల నుంచి కొండపైకి బైకుల్ని నిలిపివేస్తామని, తిరిగి 9వ తేదీన ఉ.6 గం.కు అనుమతిస్తామన్నారు.

News September 18, 2024

తక్కువసేపు నిద్ర పోతున్నారా?

image

ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటాం. తక్కువసేపు నిద్రపోతే మానసిక, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి క్షీణించటం, ఏకాగ్రత కోల్పోవడం, బరువు పెరగడం, కోపం ముంచుకురావడం, నిరుత్సాహం ఆవరించడం, పనితీరు తగ్గడం, డ్రైవింగ్‌లో ప్రమాదాలకు గురికావడం, రోగనిరోధకశక్తి క్షీణించడం, ఒత్తిడి పెరగడం, గుండె సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతంగా ఎక్కువసేపు నిద్రపోతే వీటి నుంచి తప్పించుకోవచ్చు.

News September 18, 2024

లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు

image

లెబనాన్‌లో <<14129580>>పేజర్లు<<>> పేలిన ఘటన మరువకముందే మళ్లీ అక్కడ వాకీ టాకీలు పేలాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. కాగా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇప్పటివరకు 12 మంది మరణించారు. ఈ ఘటనపై హెజ్బొల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై హమాస్, హౌతీ రెబల్స్ దాడులు చేస్తుండగా హెజ్బొల్లా కూడా రంగంలోకి దిగనుంది.