News June 19, 2024
దుబాయ్ పోలీసుల పెట్రోలింగ్‌లో సైబర్ ట్రక్
టెస్లా తయారు చేసిన సైబర్ ట్రక్‌ను దుబాయ్ పోలీసులు వినియోగిస్తున్నారు. ‘టెస్లాకు చెందిన అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు సైబర్ ట్రక్ పోలీస్ లగ్జరీ పెట్రోలింగ్ ఫ్లీట్‌లో యాడ్ అయింది’ అని దుబాయ్ పోలీస్ కమాండ్ ట్వీట్ చేసింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు అందించే సెక్యూరిటీలో ఈ సైబర్ ట్రక్‌ను ఉంచారు. ఆ దేశ పోలీసులు హై-ఎండ్ కార్లను వినియోగిస్తారు.
Similar News
News September 20, 2024
త్వరలోనే EHS రూపొందిస్తాం: మంత్రి దామోదర
TG: ఉద్యోగులకు ఆమోద యోగ్యమైన EHSను త్వరలో రూపొందిస్తామని మంత్రి రాజనర్సింహ అన్నారు. 2014లో ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టుల కోసం హెల్త్ స్కీమ్ ప్రవేశపెడతామని ఊదరగొట్టి BRS మొండిచేయి చూపించిందని దుయ్యబట్టారు. ఇప్పుడు BRS పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’ అన్నారు. 10ఏళ్లుగా నిద్రలో జోగిన BRS నాయకులకు ఇప్పుడు EHS గుర్తుకు రావడం విడ్డూరమన్నారు.
News September 20, 2024
స్థానికత విషయంలో నీట్ విద్యార్థులకు ఊరట
TG: స్థానికత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ప్రభుత్వం అంగీకరించింది. స్థానికత వ్యవహారంపై HC తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారి ఆ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సుప్రీం కోర్టుకు వివరించింది. స్థానికతను నిర్ధారిస్తూ తీర్పులున్నా ఆ విద్యార్థులు HCని ఆశ్రయించారంది.
News September 20, 2024
నన్ను కావాలనే ఇరికించారు: జానీ మాస్టర్
లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్‌గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.