News January 15, 2025
‘డాకు మహారాజ్’ 10 లక్షల టికెట్స్ సోల్డ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా అదరగొడుతోంది. బుక్ మై షోలో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 1 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. ‘బాక్సాఫీస్ దబిడి దిబిడి’ అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేటితో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News February 19, 2025
100% మళ్లీ అధికారంలోకి వస్తాం: కేసీఆర్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. తమ పార్టీ ఒక్కటే తెలంగాణ కోసం పోరాడగలదని, పార్టీ నేతలు ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్‌కు మాత్రమే తెలుసని చెప్పారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని తెలంగాణ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 19, 2025
APPLY.. రూ.55,000 జీతంతో ఉద్యోగాలు

ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మార్చి 1 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. బీఈ/బీటెక్ చేసిన వారిని అర్హులుగా పేర్కొంది. రిజర్వేషన్‌ను బట్టి వయో సడలింపు ఉంది. శాలరీ గరిష్ఠంగా రూ.55,000 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.ntpc.co.in.
News February 19, 2025
‘X’ ప్రీమియం+ ధరలు రెట్టింపు

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ ప్రీమియం+ ధరలు రెట్టింపు అయ్యాయి. మస్క్‌కు చెందిన AI సంస్థ XAI గ్రోక్-3 సేవల్ని అందుబాటులోకి తెచ్చి ధరల్ని పెంచింది. యూజర్లు ఈ AI మోడల్ ఫీచర్స్ వాడాలంటే ‘X’లో ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఈ ధర నెలకు రూ.1750 ఉండగా.. రూ.3,470కి పెంచింది. ఏడాది ప్లాన్ రూ.18,300 నుంచి రూ.34,340కి చేరింది. 2023లో ‘X’ ప్రీమియం+ సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.1300 ఉండేది.