News September 20, 2024
రాజకీయ కార్యాచరణపై దళపతి విజయ్ ప్రకటన

తమిళగ వెట్రి కళగం మొదటి రాష్ట్ర స్థాయి సదస్సును అక్టోబర్ 27న విల్లుపురం జిల్లాలోని విక్రవాండి వి సలై గ్రామంలో నిర్వహించనున్నట్టు దళపతి విజయ్ ప్రకటించారు. తమిళ ప్రజల అభిమానం, మద్దతుతో తమ విజయవంతమైన రాజకీయ యాత్ర సాగుతోందన్నారు. పార్టీ రాజకీయ భావజాల నేతలను, పార్టీ సిద్ధాంతాలను, విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను సదస్సులో ప్రకటించనున్నట్టు విజయ్ తెలిపారు.
Similar News
News November 9, 2025
ప్రీమెచ్యూర్ మెనోపాజ్ గురించి తెలుసా?

40 ఏళ్ల కంటే ముందే రుతుక్రమం ఆగిపోతే, దీన్ని ‘ప్రీమెచ్యూర్ మెనోపాజ్’ అంటారు. ప్రపంచంలో ఇతర మహిళల కంటే భారతీయ మహిళళ్లో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రేటు కాస్త ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల ఆర్థికస్థితి, పోషకాహార లోపం, కుటుంబంలో మానసిక ఒత్తిడి, పెళ్లి చిన్న వయసులోనే అవ్వడం, విడాకులు వంటివి మహిళలలో ప్రీమెచ్యూర్ మెనోపాజ్‌కు కారణమవుతాయి. కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటివి దీనికి కారణం కావొచ్చు.
News November 9, 2025
గ్రూప్-3.. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

TG: 1,388 గ్రూప్-3 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ రేపటి నుంచి ఈ నెల 26 వరకు కొనసాగనుంది. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో రోజూ 10.30AM నుంచి 1.30PM, తిరిగి 2PM నుంచి 5.30PM వరకు పరిశీలన జరగనుంది. విద్యార్హత సర్టిఫికెట్లు, హాల్‌టికెట్, ఆధార్/ఏదైనా ప్రభుత్వ ఐడీ, అప్లికేషన్ ఫామ్ తదితర పత్రాలను తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు https://www.tgpsc.gov.in/ సంప్రదించవచ్చు.
News November 9, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో 54 రన్స్

హాంకాంగ్ సిక్సెస్-2025లో ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో మ్యాచులో బంగ్లా ఓపెనర్ హబీబుర్ రెహ్మాన్ ఊచకోత కోశారు. 13 బంతుల్లోనే 54 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. ఆయన ఏకంగా 8 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. అంటే బౌండరీల ద్వారానే 52 రన్స్ రాబట్టారు. మరో ప్లేయర్ హొస్సైన్ 8 బంతుల్లో 27 రన్స్ చేయడంతో BAN 6 ఓవర్లలో 128 పరుగులు చేసింది. SA 25 రన్స్ తేడాతో ఓడిపోయింది.


