News March 27, 2024
దమ్ముంటే లోకేశ్, బాబు నాపై పోటీ చేయాలి: కొడాలి నాని

AP: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌కు దమ్ముంటే తనపై గుడివాడలో పోటీ చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. ‘నాకు భయపడి గంటకో వ్యక్తిని పోటీకి దింపుతున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని పోటీకి పెట్టారు. ఈసారి అంతరిక్షం నుంచి తీసుకొస్తారేమో? చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేరు. ఎంతమంది వచ్చినా గుడివాడలో ఐదోసారి గెలవబోతున్నా’ అని ఆయన తెలిపారు.
Similar News
News November 19, 2025
ఇండియా-ఎ ఓటమి

సౌతాఫ్రికా-ఎతో జరిగిన 3వ అనధికారిక వన్డేలో భారత్-ఎ 73 రన్స్ తేడాతో ఓడిపోయింది. SA నిర్దేశించిన 326 రన్స్ టార్గెట్‌ను ఛేదించలేక 252 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో ఆయుష్ బదోని(66), ఇషాన్ కిషన్(53) మినహా ఎవరూ రాణించలేదు. రుతురాజ్ 25, అభిషేక్ 11, తిలక్ వర్మ 11, పరాగ్ 17 రన్స్‌కే ఔటై నిరాశపరిచారు. అంతకుమందు SA ఓపెనర్లు ప్రిటోరియస్(123), మూన్‌సమీ(107) సెంచరీలతో చెలరేగారు.
News November 19, 2025
ప్రజల సొమ్ముతో పక్క రాష్ట్రంలో జల్సాలు: YCP

AP: ప్రజల సొమ్ముతో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్ స్పెషల్ ఫ్లైట్లలో జల్సాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ‘వీకెండ్ వస్తే చాలు స్పెషల్ ఫ్లైట్‌లో HYDకు వెళ్లిపోతారు. ఎవడి అబ్బ సొమ్ము అని ఇలా ప్రజాధనాన్ని తగలేస్తున్నారు చంద్రబాబూ? ఈ 17 నెలల్లో చంద్రబాబు 80సార్లు, లోకేశ్ 83సార్లు, పవన్ కళ్యాణ్ 104సార్లు HYDకి వెళ్లారు’ అని విమర్శలు గుప్పిస్తూ పైనున్న ఫొటోను Xలో పోస్ట్ చేసింది.
News November 19, 2025
ప్రమోటీ జుడీషియరీ ఆఫీసర్లకు జిల్లా జడ్జి పోస్టుల్లో కోటా ఉండదు: SC

సివిల్ జడ్జిలుగా ప్రమోటైన జుడీషియరీ ఆఫీసర్లకు జిల్లా జడ్జి పోస్టుల్లో కోటా ఉండదని SC పేర్కొంది. వారికి వెయిటేజీని తిరస్కరించింది. ఈమేరకు గైడ్‌లైన్స్ ప్రకటించింది. హయ్యర్ జుడీషియల్ సర్వీసుల్లో సీనియారిటీ నిర్ణయానికి ఏకీకృత వార్షిక రోస్టర్ రూపొందిస్తారు. రెగ్యులర్ ప్రమోషన్, డైరక్ట్ రిక్రూటీలకు ఎంట్రీ తేదీ ఆధారంగా సీనియార్టీ నిర్ణయిస్తారు. GOVTలు హైకోర్టులతో మాట్లాడి విధివిధానాలు రూపొందించాలి.


