News October 23, 2024

‘దానా’ తుఫాను.. ఆ పేరెవరు పెట్టారంటే?

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుఫాను వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే హెచ్చరించింది. ఆ తుఫానుకు దానా అని నామకరణం చేసిన దేశం ఖతర్. ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) రూపొందించిన ఉష్ణమండల తుఫాను నామకరణ విధానం ప్రకారం ఖతర్ ఈ పేరు పెట్టింది. దానా అనే పదానికి అరబిక్‌లో ‘ఉదారత’ అని అర్థం.

Similar News

News October 23, 2024

కాసేపట్లో కోర్టుకు కేటీఆర్

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో నాంపల్లి స్పెషల్ కోర్టుకు వెళ్లనున్నారు. మంత్రి కొండా సురేఖ‌పై పరువు నష్టం పిటిషన్ వేసిన ఆయన అందుకు సంబంధించి స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. గత విచారణ సందర్భంగా కొంత సమయం కావాలని కేటీఆర్ అడిగారు. దీంతో విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. మరోవైపు తమ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సురేఖపై హీరో నాగార్జున కూడా పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

News October 23, 2024

విశాఖ ఉక్కు పరిశ్రమలో VRSపై సర్వే

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల VRSపై యాజమాన్యం సర్వే చేస్తోంది. VRS కోరుకునే ఉద్యోగి 15 ఏళ్ల సర్వీస్, 45 ఏళ్లలోపు వయసు ఉండాలని నిబంధన విధించింది. అర్హులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో VRS పేరుతో దగా చేస్తున్నారని, 2500 మందిని ఇంటికి పంపడానికి కుట్రలు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే పరిహారం గురించి ప్రస్తావన లేకపోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

News October 23, 2024

STOCK MARKETS: ఆరంభ లాభాలను నిలబెట్టుకుంటాయా!

image

బెంచ్‌మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న బలమైన షేర్లను ఇన్వెస్టర్లు కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 80,381 (+158), నిఫ్టీ 24,521 (+49) వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఆరంభ లాభాలను నిలబెట్టుకుంటాయా లేదా చూడాల్సి ఉంది. రియాల్టి, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఐటీ, ఫైనాన్స్, మెటల్ షేర్లు పుంజుకున్నాయి.