News August 28, 2024
DANGER: రోడ్ సైడ్ ఫుడ్స్ తింటున్నారా?
వైరల్ ఫీవర్స్ పెరుగుతుండటంతో రోడ్ సైడ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పానీపూరీతో పాటు ఇలా రోడ్డు పక్కనున్న చిరుతిండ్లు తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. టైఫాయిడ్, జియర్డియాసిస్ (నీళ్ల విరేచనాలు), హెచ్ పైలోరి (కడుపులో మంట, జీర్ణాశయంలో పుండ్లు), షిగెల్లోసిస్(జిగటతో కూడిన రక్త విరేచనాలు), కలరా, ఎంటమీబా, వైరల్ విరేచనాలు, వాంతులు వంటి వ్యాధులు సోకుతాయి.
Similar News
News September 15, 2024
రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.
News September 15, 2024
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా?: హరీశ్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేసిందా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పింఛన్లు పెంపు, 2 లక్షల ఉద్యోగాలు, రుణమాఫీ అసంపూర్తిగా చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై విమర్శలు మాని ప్రజల ఇబ్బందులను తొలగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం రేవంత్ అబద్ధాల వరద పారిస్తున్నారని మండిపడ్డారు. వానాకాలం రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు.
News September 15, 2024
రేవంత్.. నువ్వు వెంపలి చెట్టంత కూడా పెరగలేదు కదా?: హరీశ్
TG: తనను తాడిచెట్టులా పెరిగానన్న CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ తీవ్రంగా స్పందించారు. ‘అవును నేను తాడి చెట్టంత ఎదిగాను. అది నాకు దేవుడు ఇచ్చాడు. అందులో తప్పేముంది. నువ్వు వెంపలి చెట్టంత కూడా పెరగలేదు కదా? ఇలాంటి చిల్లర మాటలు మానెయ్ రేవంత్. నీ స్థాయిని తగ్గించుకోకు. రుణమాఫీ చేశా అంటున్నావ్ కదా? నీ స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లి చూద్దాం మాఫీ జరిగిందో? లేదో?’ అని సవాల్ విసిరారు.