News September 17, 2024
వినాయక నిమజ్జనంలో ప్రమాదం
మహారాష్ట్రలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపు ప్రారంభానికి ముందు ట్రాక్టర్ డ్రైవర్ ఎక్కడికో వెళ్లగా.. మరో వ్యక్తి స్టార్ట్ చేశాడు. అది రివర్స్ వెళ్లి ప్రజలపైకి దూసుకెళ్లడంతో 13, 6, 3 ఏళ్ల పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వ్యక్తి, అసలైన డ్రైవర్ పారిపోగా, పోలీసులు వెతికి పట్టుకున్నారు. ధూలే జిల్లాలోని చిత్తోడ్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News October 3, 2024
PM- RKVY స్కీమ్‌కు రూ.లక్ష కోట్ల మంజూరు
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి రూ.లక్ష కోట్లను మంజూరు చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్‌కు ఆమోదం తెలిపింది. రూ.10,103 కోట్లతో నూనెగింజల ఉత్పత్తికి నిర్ణయించింది. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించింది. చెన్నై మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలిపింది.
News October 3, 2024
‘వైవాహిక అత్యాచారం’ పిటిషన్లను వ్యతిరేకించిన కేంద్రం
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలకు ‘అత్యాచారాన్ని’ మినహాయించే ప్రస్తుత ఉన్న చట్టాలను సమర్థించింది. వివాహిత అత్యాచారం అనేది చట్టబద్ధమైన సమస్య కంటే సామాజిక ఆందోళన అని, ఈ విషయంలో నిర్ణయం తీసుకొనే ముందు విస్తృత చర్చ జరగాల్సి ఉందని పేర్కొంది. వివాహాన్ని సమాన బాధ్యతలు కలిగిన బంధంగా పరిగణిస్తారంది.
News October 3, 2024
రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 78 రోజుల బోనస్ ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం రైల్వే శాఖలో పనిచేస్తున్న సుమారు 11.72 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు పనితీరు ఆధారిత (Productivity Linked Bonus) బోనస్ లభించనుంది. అర్హత ఉన్న ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజులకుగానూ గరిష్ఠంగా రూ.17,951 చెల్లించనున్నారు.