News November 12, 2024
DANGER: స్నానానికి స్క్రబ్స్ వాడుతున్నారా?
సబ్బు, బాడీ వాష్‌లకు అదనంగా చర్మం మృదువుగా మారడానికి, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి స్క్రబ్స్(సింథటిక్/ప్లాంట్ ఫైబర్)ను వాడటం పెరిగింది. అయితే వీటిని ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ తగలకపోవడం వల్ల స్క్రబ్స్‌పై బాక్టీరియా, సూక్ష్మక్రిములు, బూజు పేరుకుపోతాయంటున్నారు. దీంతో చర్మ వ్యాధులు, అలర్జీలు పెరుగుతాయని చెబుతున్నారు.
Similar News
News December 6, 2024
రేపు నటి, నటుడి పెళ్లి
తెలుగు నటుడు సాయి కిరణ్ 46 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకోబోతున్నారు. సీరియల్ నటి స్రవంతితో రేపు ఆయన పెళ్లి జరగనుంది. ‘నువ్వే కావాలి’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ పలు సినిమాల్లో హీరోగా, సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. సాయి కిరణ్ తొలి వివాహం 2010లో వైష్ణవి అనే మహిళతో జరిగింది. వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వారికి ఒక కూతురు ఉంది.
News December 6, 2024
జగన్ పాలన.. దళితులకు నరకయాతన: లోకేశ్
AP: గత టీడీపీ హయాం(2014-19)తో పోలిస్తే వైసీపీ పాలనలో దళితులపై దాడులు 10 రెట్లు పెరిగాయని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘జగన్ జమానాలో దళితులపై దమనకాండకు ఇవిగో సాక్ష్యాలు. దళితులను చంపి డోర్ డెలివరీ చేశారు. జే బ్రాండ్స్‌పై పోరాడినందుకు హత్యలు చేశారు. ఇసుక అక్రమాలపై నోరెత్తినందుకు శిరోముండనం చేశారు. జగన్ పాపాల చిట్టా రాజ్యసభ సాక్షిగా దేశానికి తెలిసింది’ అంటూ ఆయన Xలో పోస్ట్ చేశారు.
News December 6, 2024
నెల రోజుల్లోపే OTTల్లోకి సినిమాలు!
థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే కొన్ని సినిమాలు OTTలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల మట్కా(21 రోజులు), లక్కీ భాస్కర్ (28), క (28) నెలరోజుల్లోపే OTTలోకి రాగా నవంబర్ 14న థియేటర్లలో రిలీజైన ‘కంగువ’ 28 రోజుల్లోపే (DEC8 న) OTTలోకి రానుంది. అమరన్ 35 రోజుల్లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే, నెల రోజుల్లో ఎలాగో OTTకి వస్తుందన్న భావనతో జనం థియేటర్లకు రారని పలువురు సినీ ప్రియులు అంటున్నారు.