News February 9, 2025
కోతి చేష్టలతో లంకలో చీకట్లు

ఓ కోతి నిర్వాకం వల్ల శ్రీలంకలో చీకట్లు అలుముకున్నాయి. సౌత్ కొలంబో ప్రాంతంలోని మెయిన్ పవర్ గ్రిడ్ ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన తీగలపై ఓ కోతి వేలాడటంతో అకస్మాత్తుగా విద్యుత్ నిలిచిపోయింది. దీంతో కొలంబో నగరవ్యాప్తంగా కొన్ని గంటలపాటు కరెంటు సరఫరా కాలేదు. కొన్ని ప్రాంతాల్లో 5-6 గంటలపాటు కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.
Similar News
News October 15, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పంకజ్ ధీర్(68) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచినట్లు సినీ& TV ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1988-94 మధ్య BR చోప్రా తెరకెక్కించిన ‘మహాభారత్’ టీవీ సీరియల్లో కర్ణుడి పాత్రతో పంకజ్ గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు.
News October 15, 2025
బిహార్లో 57 మందితో JDU తొలిజాబితా

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు పాలక జనతాదళ్(U) 57 మందితో తొలిజాబితా విడుదల చేసింది. నిన్న NDA కూటమిలోని బీజేపీ 71 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. 2 విడతల్లో జరిగే ఎన్నికల్లో BJP, JDU చెరో 101 సీట్లలో, LJP (R)29, RLM, HAM 6 చొప్పున సీట్లలో పోటీచేయాలని నిర్ణయించాయి. అయితే తమకు సంబంధించిన కొన్ని స్థానాలను LJPకి కేటాయించడంపై JDU అభ్యంతరం చెబుతోంది. ఆ స్థానాల్లో తమ వారికి టిక్కెట్లు ఇచ్చింది.
News October 15, 2025
పత్తి దిగుబడి పెరగాలంటే..

ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ తయారీ దశలో ఉంది. మూడు నెలలు పై బడిన పంటకు యూరియా, పొటాష్, కాంప్లెక్స్ వంటి ఎరువులను పైపాటుగా వేయరాదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ‘పంటపై 10గ్రా. 13:0:45(మల్టీ-కే) లేదా 19:19:19(పాలిఫీడ్) లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి. లేదా 20గ్రా. యూరియాను 10-15రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే కాయ ఎదుగుదల బాగుంటుంది. అధిక దిగుబడి సాధ్యమవుతుంది’ అని పేర్కొంటున్నారు.