News June 20, 2024

అభిమానిని చంపి.. భార్య ఫ్లాట్‌లో పూజలు చేసిన దర్శన్!

image

తన అభిమాని రేణుకస్వామిని నటుడు దర్శన్ హత్య చేసిన ఘటన కన్నడ నాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాన్ని పోలీసులు సేకరించారు. హత్య సమయంలో దర్శన్ వాడిన లోఫర్స్‌ని అతని భార్య విజయలక్ష్మి ఫ్లాట్‌లో గుర్తించారు. హత్య తర్వాత అక్కడికొచ్చిన దర్శన్ ఇంట్లో పూజలు చేసి మైసూర్ వెళ్లారట. మరికొన్ని దుస్తులు, ఫుట్‌వేర్‌ని కూడా విజయలక్ష్మికి దర్శన్ అసిస్టెంట్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.

Similar News

News October 29, 2025

తుఫాన్.. ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు

image

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం(మత్స్యకారులకు 50కేజీలు), లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్‌కు సూచించింది.

News October 29, 2025

భారీ వర్షాలు.. కల్లాల మీద ధాన్యం ఉందా?

image

కోతకోసి కుప్ప మీద ఉన్న ధాన్యాన్ని బరకాలు కప్పుకొని రైతులు రక్షించుకోవాలి. నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలులేని పరిస్థితుల్లో ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక లేదా ఎండు వరిగడ్డిని కలిపితే గింజను వారం రోజులపాటు మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని ఎండబెట్టి, తూర్పార పట్టి నిలువ చేసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ సూచించింది.

News October 29, 2025

డౌన్స్‌ సిండ్రోమ్ పిల్లలకు ఈ పరీక్షలు చేయిస్తున్నారా?

image

డౌన్స్‌ సిండ్రోమ్‌ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికోసారి కంటి పరీక్షలు, 6-12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. ప్రతి ఆర్నెల్లకోసారి దంత పరీక్షలు, 3-5 ఏళ్లకోసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్‌రే తీసి పరీక్షిస్తూ ఉండాలి. అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే పాప్‌ స్మియర్‌ పరీక్ష, సంవత్సరానికోసారి థైరాయిడ్‌ పరీక్ష చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.