News June 20, 2024
అభిమానిని చంపి.. భార్య ఫ్లాట్‌లో పూజలు చేసిన దర్శన్!

తన అభిమాని రేణుకస్వామిని నటుడు దర్శన్ హత్య చేసిన ఘటన కన్నడ నాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక ఆధారాన్ని పోలీసులు సేకరించారు. హత్య సమయంలో దర్శన్ వాడిన లోఫర్స్‌ని అతని భార్య విజయలక్ష్మి ఫ్లాట్‌లో గుర్తించారు. హత్య తర్వాత అక్కడికొచ్చిన దర్శన్ ఇంట్లో పూజలు చేసి మైసూర్ వెళ్లారట. మరికొన్ని దుస్తులు, ఫుట్‌వేర్‌ని కూడా విజయలక్ష్మికి దర్శన్ అసిస్టెంట్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.
Similar News
News April 17, 2026
TU: పార్లమెంట్‌లో ప్రసంగించిన ‘కీర్తన’ను అభినందించిన ఉపకులపతి

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం నుంచి ఎంపికైన TU విద్యార్థిని కీర్తన ఈనెల 14న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించారు. VC యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి ఆమెను అభినందించారు. యూనివర్సిటీ తరఫున రూ.5 వేల ప్రోత్సాహక బహుమతి అందజేశారు. VC మాట్లాడుతూ.. కీర్తన ఇంకెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని ఆకాంక్షించారు.
News April 17, 2026
హీరోయిన్ పెళ్లి వార్తలు.. ఖండించిన తల్లి

మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్‌తో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తలను ఆమె తల్లి లిస్సీ ఖండించారు. వారి మ్యారేజ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ ఓ వ్యక్తి SMలో చేసిన కామెంట్‌కు ఆమె ‘ఫాల్స్ న్యూస్’ అని ఆన్సరిచ్చారు. 2022లో వచ్చిన హృదయం మూవీలో వీరిద్దరూ మ్యారీడ్ కపుల్‌గా నటించారు. ఆ సమయంలో ప్రేమ చిగురించిందని రూమర్లు వచ్చాయి. కాగా గతేడాది లోక: చాప్టర్-1తో కళ్యాణి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
News April 17, 2026
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఇదే

మహిళా రిజర్వేషన్ ప్రస్తావన రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోనే (1946-49) వచ్చినా అది సాధ్యపడలేదు. 1996లో దేవెగౌడ ప్రభుత్వం 33% రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టగా గందరగోళం నెలకొంది. 1998-2003 మధ్య నాలుగుసార్లు సేమ్ సీన్ రిపీటైంది. 2010లో మళ్లీ UPA ప్రభుత్వం మొదట రాజ్యసభలో ఆమోదించినా ఆ తర్వాత జాప్యం వల్ల అమలులోకి రాలేదు. 2023లో ఈ బిల్లుకు ఆమోదం లభించగా దీనికి సవరణలు చేపట్టి కేంద్రం మరోసారి తీసుకొచ్చింది.


