News October 8, 2024

మహాలక్ష్మీ దేవిగా దుర్గమ్మ దర్శనం

image

AP: విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు మూల నక్షత్రంలో సరస్వతీ దేవిగా అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Similar News

News November 10, 2024

ఒకే స్కూల్‌లో 120 మంది కవలలు

image

పంజాబ్‌లోని జలంధర్‌లో పోలీస్ DAV పబ్లిక్ స్కూల్‌కి వెళితే ఆ స్టూడెంట్స్‌ను చూశాక ఎవరైనా కన్ఫ్యూజ్ కావాల్సిందే. స్కూల్‌లో ఎక్కడ చూసినా కవలలే కనిపిస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఎలా ఉంటారు మరి! ఇక్కడ 60 జతలు అంటే మొత్తం 120 మంది విద్యార్థులు కవలలే. ఇందులో ట్విన్స్(ఇద్దరు) మాత్రమే కాదు ట్రిప్లెట్స్(ముగ్గురు కవలలు) కూడా ఉన్నారు. కాగా కవల పిల్లలు పుట్టడం ప్రకృతిలో ఒక అద్భుతమని అక్కడి టీచర్లంటున్నారు.

News November 10, 2024

కార్తీక మాసం ఎఫెక్ట్.. తగ్గుతున్న చికెన్ ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కార్తీక మాసం కారణంగా భక్తులు మాంసాహారానికి దూరంగా ఉండటంతో వ్యాపారులు రేట్లను తగ్గిస్తున్నారు. రెండు వారాల కింద కిలో చికెన్(స్కిన్ లెస్) రూ.270-300 ఉండగా, ప్రస్తుతం చాలా పట్టణాల్లో రూ.180-210 పలుకుతోంది. డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో యథాతథంగా రేట్లు ఉన్నాయి. కాగా ఈ నెలలో మరింత తగ్గి, డిసెంబర్ నుంచి రేట్లు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు.

News November 10, 2024

ఆ బోర్డు నాలుగు అక్షరాల క్రూరత్వం: కేంద్రమంత్రి

image

వక్ఫ్ బోర్డుపై కేంద్ర మంత్రి సురేశ్ గోపి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అది ఒక నాలుగు ఆంగ్ల అక్షరాల ‘క్రూరత్వం” అని అన్నారు. కేరళలోని మునంబామ్‌లో క్రిస్టియన్లకు చెందిన 400 ఎకరాలు తమకు చెందుతాయని వక్ఫ్ బోర్డు అనడాన్ని తప్పుబట్టారు. త్వరలో వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మండిపడింది. ప్రజలను విభజించి పాలించే ప్రకటనలు మానుకోవాలంది.