News July 4, 2024
బెంగళూరు కమిషనర్‌కు దర్శన్ భార్య లేఖ
మర్డర్ కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి బెంగళూరు కమిషనర్‌కు తాజాగా లేఖ రాశారు. కేసులో మరో నిందితురాలైన పవిత్రను ‘దర్శన్ భార్య’ అనొద్దని విజ్ఞప్తి చేశారు. ‘చట్టప్రకారం దర్శన్‌కు నేను మాత్రమే భార్యను. కానీ మీరు, రాష్ట్ర హోంమంత్రి, మీడియా అందరూ పవిత్రను భార్యగా చెబుతున్నారు. అది నాకు, నా బిడ్డకు ఇబ్బందిగా మారుతోంది. దయచేసి మీ రికార్డుల్లో పవిత్రను భార్యగా రాయొద్దు’ అని కోరారు.
Similar News
News October 13, 2024
రతన్ టాటా ఓ ఛాంపియన్: నెతన్యాహు
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఓ ఛాంపియన్ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియాడారు. ‘నాతోపాటు ఇజ్రాయెల్ ప్రజలందరూ టాటా మృతికి సంతాపం తెలుపుతున్నాం. ఆయన భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేయండి’ అని ప్రధాని మోదీని ఎక్స్‌లో ట్యాగ్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా సంతాపం తెలిపారు.
News October 13, 2024
ఇరాన్ అణు స్థావరాలపై సైబర్ అటాక్?
ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులకు దిగినట్లు తెలుస్తోంది. న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖల సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. తమ విలువైన డాటా చోరీకి గురైనట్లు ఇరాన్ కూడా వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్ చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరపొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
News October 13, 2024
మరోసారి నిరాశపర్చిన అభిషేక్ శర్మ
టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచారు. ఈ సిరీస్‌లో అభి వరుసగా 16, 15, 4 పరుగులే చేశారు. దీంతో అంచనాలకు తగ్గట్లుగా అతడు రాణించలేకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో వచ్చిన ఛాన్స్‌లను ఆయన వృథా చేసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే ఆడితే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టమని చెబుతున్నారు.