News February 24, 2025

తేది: ఫిబ్రవరి 24, సోమవారం

image

ఫజర్: తెల్లవారుజామున 5.25 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.38 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.29 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
ఇష: రాత్రి 7.34 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News February 24, 2025

ఆనందంగా ఉంది: కోహ్లీ

image

కీలక మ్యాచ్‌లో సెంచరీ చేయడం ఆనందంగా ఉందని పాక్‌తో గేమ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపారు. నా శక్తిని, ఆలోచనలను పూర్తిగా అదుపులో ఉంచుకొని ఎక్కువసేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రోహిత్ త్వరగా ఔటైనా తాను ఎక్కువ రన్స్ చేయడం సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. షాహీన్ బౌలింగ్‌లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అందుకే అతడిని వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా పిలుస్తారని కోహ్లీ కితాబిచ్చారు.

News February 24, 2025

పాకిస్థాన్‌పై ఢిల్లీ పోలీస్ శాఖ సూపర్ పంచ్

image

CTలో భారత్‌ చేతిలో ఓడిన పాకిస్థాన్ జట్టుపై ఢిల్లీ పోలీస్ శాఖ వేసిన ట్వీట్ అదిరిపోయింది. ‘పక్క దేశం నుంచి పెద్ద, పెద్ద శబ్ధాలు వినిపిస్తున్నాయి. అదృష్టవశాత్తూ అవి కేవలం టీవీలను పగలగొట్టిన సౌండ్స్ అనే ఆశిస్తున్నాం’ అంటూ సెటైర్లు వేసింది. ఇక ఓటమి నేపథ్యంలో పాక్‌లో టీవీలను పగలగొట్టకుండా వాటికి ఇనుప కంచెలు వేసిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

News February 24, 2025

హార్దిక్ పాండ్య వాచ్ ధర ఎంతో తెలుసా?

image

పాక్‌తో మ్యాచులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ధరించిన చేతి గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన ఈ వాచ్ రిటైల్ ధర ₹1.50కోట్లకు పైగా ఉంటుంది. రఫెల్ నాదల్, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో ​​రొనాల్డో వంటి క్రీడాకారులతో పాటు సినీ హీరో రామ్ చరణ్ ఈ గడియారాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.

error: Content is protected !!