News November 14, 2024
ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవాల తేదీలివే

అంతర్జాతీయంగా నవంబరు 20 బాలల దినోత్సవం కాగా.. వివిధ దేశాలు ఏటా వేర్వేరు తేదీల్లో ఈ వేడుక జరుపుతుంటాయి. USలో జూన్లో రెండో ఆదివారాన్ని చిల్డ్రన్స్ డేగా నిర్వహిస్తారు. UKలో మే రెండో ఆదివారం, రష్యా-చైనాలో జూన్ 1, మెక్సికోలో ఏప్రిల్ 30, జపాన్-దక్షిణ కొరియాలో మే 5, తుర్కియేలో ఏప్రిల్ 23, బ్రెజిల్లో అక్టోబరు 12, జర్మనీలో సెప్టెంబరు 20, థాయ్లాండ్లో జనవరిలో రెండో శనివారం చిల్డ్రన్స్ డే జరుగుతుంది.
Similar News
News November 18, 2025
మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం

AP: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా ఆరుగురు మావోలు మరణించారు. హిడ్మా కోసం పలు రాష్ట్రాల పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీగా ఉన్నాడు.

ఈ పుస్తకాలు మీరెప్పుడైనా చదివారా?

బిజీ లైఫ్స్టైల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు, మానసిక ప్రశాంతత, నిద్ర కోసం పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యం. జ్ఞానం, వినోదం అందించే కొన్ని తెలుగు పుస్తకాలు మీకోసం. 1 కన్యాశుల్కము- గురజాడ 2. మహాప్రస్థానం -శ్రీశ్రీ 3.అమృతం కురిసిన రాత్రి – దేవరకొండ బాలగంగాధర తిలక్ 4. మార్గదర్శి కథలు – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 5.ఛంఘిజ్ఖాన్ – తెన్నేటి సూరి 6. అమరావతి కథలు- సత్యం శంకరమంచి 7.మైదానం- గుడిపాటి వెంకట చలం