News November 14, 2024
ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవాల తేదీలివే
అంతర్జాతీయంగా నవంబరు 20 బాలల దినోత్సవం కాగా.. వివిధ దేశాలు ఏటా వేర్వేరు తేదీల్లో ఈ వేడుక జరుపుతుంటాయి. USలో జూన్‌లో రెండో ఆదివారాన్ని చిల్డ్రన్స్ డేగా నిర్వహిస్తారు. UKలో మే రెండో ఆదివారం, రష్యా-చైనాలో జూన్ 1, మెక్సికోలో ఏప్రిల్ 30, జపాన్-దక్షిణ కొరియాలో మే 5, తుర్కియేలో ఏప్రిల్ 23, బ్రెజిల్‌లో అక్టోబరు 12, జర్మనీలో సెప్టెంబరు 20, థాయ్‌లాండ్‌లో జనవరిలో రెండో శనివారం చిల్డ్రన్స్ డే జరుగుతుంది.
Similar News
News December 11, 2024
స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
క్రిస్మస్ సందర్భంగా స్కూళ్లకు మూడు రోజులు సెలవులు ఇస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే నేపథ్యంలో సెలవులుగా పేర్కొంది. గతంలో క్రిస్మస్‌కు 5 రోజులు సెలవులు ఇవ్వగా ఈసారి ప్రభుత్వం 3 రోజులకు కుదించింది. మరోవైపు ఏపీలో 24, 26న ఆప్షనల్ హాలిడే, 25న జనరల్ హాలిడే ఉండనుంది.
News December 11, 2024
మెహుల్ చోక్సీ ఆస్తుల వేలం!
ఆర్థిక నేరస్థుడు మెహుల్ చోక్సీ ఆస్తులు వేలం వేయడానికి ఈడీ సిద్ధమైంది. అతడికి చెందిన రూ.2,500కోట్లు విలువైన సొత్తును అక్రమాస్తుల నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. కాగా, ఈ ఆస్తుల వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని PNB, ICICI బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఈడీ కోర్టు ఇప్పటికే ఆదేశించింది. తప్పుడు పత్రాలతో PNBకి రూ.13వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెహుల్ చోక్సీ విదేశాలకు పరారయ్యారు.
News December 11, 2024
మూడోదైనా గెలుస్తారా?
వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఇవాళ ఉదయం 9.50 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయిన ఇండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమవుతున్న టీమ్ ఇండియా ప్లేయర్లు ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.