News November 18, 2024
గ్రూప్-3 పరీక్షకు కూతురు హాజరు.. కిడ్నాప్ చేశామంటూ తండ్రికి ఫోన్
TG: ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. రూ.20వేలు ఇస్తేనే వదిలిపెడతాం’ అంటూ మహబూబాబాద్‌కు చెందిన డోలి వెంకటేశ్వర్లుకు ఓ ఆగంతకుడు నిన్న ఫోన్ చేశాడు. అయితే అంతకుముందే ఆమెను సోదరుడు గ్రూప్-3 ఎగ్జామ్ సెంటర్ వద్ద వదిలివచ్చాడు. అనుమానం వచ్చిన వెంకటేశ్వర్లు కేంద్రం వద్దకు వెళ్లి పోలీసులకు విషయం చెప్పాడు. ఆమె ఎగ్జామ్ సెంటర్‌లోనే ఉందని వారు నిర్ధారించారు. దీంతో కిడ్నాప్ కాల్ సైబర్ నేరగాళ్ల పనేనని తేల్చారు.
Similar News
News December 7, 2024
ఈనెల 15న WPL మినీ వేలం
బెంగళూరులో ఈనెల 15న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మినీ వేలం నిర్వహించనున్నట్లు BCCI ప్రకటించింది. మొత్తం 120 మంది ప్లేయర్లు ఆక్షన్‌లో పాల్గొంటున్నారని, అందులో 29 మంది విదేశీ ప్లేయర్లున్నారని తెలిపింది. స్వదేశీ క్రికెటర్ల కోసం 19 స్లాట్లు, ఓవర్సీస్ ప్లేయర్లకు 5 స్లాట్లు కేటాయించినట్లు పేర్కొంది. WPLలో మొత్తం 5 జట్లు (ఢిల్లీ, గుజరాత్, ముంబై, బెంగళూరు, యూపీ) పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.
News December 7, 2024
బ్రిక్స్ కరెన్సీపై ప్రతిపాదనలు లేవు: జైశంకర్
US డాలర్‌తో పోటీ పడేందుకు బ్రిక్స్ దేశాల కొత్త కరెన్సీ తెచ్చే విషయమై నిర్ణయం తీసుకోలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. $ విలువ తగ్గింపుపై భారత్‌కు ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, బ్రిక్స్ కరెన్సీపై ఎలాంటి ప్రతిపాదనలు లేవన్నారు. కాగా బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీ తెస్తే 100% టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించారు.
News December 7, 2024
ఏటా డిసెంబర్ 15న ఆత్మార్పణ దినం
AP: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబర్ 15)ని ఏటా ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన జీవిత చరిత్రపై పిల్లలకు క్విజ్, వ్యాసరచనలో పోటీలు పెట్టాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.