News October 24, 2024
వరకట్నం వేధింపులతో కూతురు మృతి.. తండ్రి వినూత్న నిరసన
నారాయణపేట(D)కు చెందిన చన్నప్పగౌడ కూతురు జయలక్ష్మికి కర్ణాటకలోని శంకర్‌పల్లికి చెందిన శంకర్‌రెడ్డితో 3ఏళ్ల క్రితం పెళ్లి చేశారు. కాగా వరకట్న వేధింపులతో ఆమె ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. చన్నప్ప PSలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఆవేదనకు గురైన ఆ తండ్రి ‘నా కూతురు మృతికి కారణమైన భర్త, అత్త, ఆడపడుచు అదృశ్యమయ్యారు. కనిపిస్తే నాకు సమాచారమివ్వండి’ అని జాతీయ రహదారిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
Similar News
News November 2, 2024
విశాఖ TO అమరావతి 2 గంటల్లో వెళ్లేలా..: CM
AP: విశాఖ నుంచి అమరావతికి 2 గంటల్లో వెళ్లేలా రోడ్లను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నేషనల్ హైవేలపై ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు నాంది పలుకుతున్నామని, సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. నక్కపల్లి వద్ద రూ.70వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని తెలిపారు.
News November 2, 2024
భారత్ ఆలౌట్.. 28 పరుగుల ఆధిక్యం
NZతో జరుగుతోన్న చివరి టెస్టులో భారత్ స్వల్ప ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్సులో కివీస్ 235 రన్స్ చేయగా టీమ్ ఇండియా 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేనకు 28 పరుగుల ఆధిక్యం లభించింది. గిల్ 90, పంత్ 60 రన్స్ చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 38 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో సత్తా చాటారు.
News November 2, 2024
రేషన్‌లో బియ్యం, పంచదార, కందిపప్పు, జొన్నలు
AP: రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి రేషన్‌లో జొన్నలను కూడా ప్రభుత్వం చేర్చింది. బియ్యం వద్దనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. గరిష్ఠంగా 3KGల వరకు ఇస్తారు. ఇటు పంచదార, కందిపప్పుని సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ నెల నుంచి 100% రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా చర్యలు తీసుకున్నారు. రూ.67కి కందిపప్పు, అరకేజీ పంచదార రూ.17కు ఇస్తున్నారు.